Ap Politics : తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి అరెస్ట్...! అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నగరంలో విధ్వంసకాండను సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాడిపత్రి ఎమ్మెల్యేని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. By Bhavana 15 May 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Pedda Reddy Arrest : అనంతపురం జిల్లా తాడిపత్రి(Tadipatri)లో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి(Kethireddy Pedda Reddy)ని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నగరంలో విధ్వంసకాండను సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాడిపత్రి యుద్దభూమిని తలపించింది. పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి టీడీపీ(TDP) ఏజెంట్ల పై దాడికి దిగారు. దీంతో టీడీపీ నాయకుడు సూర్యముని అనుచచరులు వైసీపీ(YCP) ఏజెంట్లను నిలదీయగా అతను పెద్దారెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకుని వెళ్లడంతో ఆయన ఆవేశంతో మా వర్గీయులనే ప్రశ్నిస్తారా అంటూ.. ఆయన అనుచరులతో కలిసి టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటి వద్దకు వెళ్లి రాళ్ల దాడి చేశారు. దీంతో పోలీసు బలగాలు అల్లరి మూకలను చెదరగొట్టారు. ఈ క్రమంలోనే వైసీపీ మూకలు దాడి చేయడంతో పట్టణ సీఐ మురళీ కృష్ణకు తీవ్ర గాయాలు అయ్యాయి. అంతేకాకుండా ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అక్కడితో ఆగకుండా ఇరు వర్గాల వారు కూడా బాణసంచా ఒకరి ఇంటి మీదకు ఒకరు కాల్చుకుని కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో కేంద్ర బలగాలు భారీగా తాడిపత్రికి చేరుకొని అల్లరి మూకలను చెదరగొట్టాయి. దీంతో తాడిపత్రిలో ఘర్షణలకు కారణమైన ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేశారు. Also read: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం! #arrest #politics #mla #tadipatri #peddareddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి