T20 World Cup 2024: టీమిండియా బంగ్లాదేశ్ ల మధ్య వార్మప్ మ్యాచ్ ఈరోజే!

వరల్డ్ కప్ 2024 సన్నాహకాలు మొదలైపోయాయి. ఇప్పటికే పోటీలు జరగనున్న అమెరికాకు టీమ్స్ అన్నీ చేరుకున్నాయి. ఈరోజు టీమిండియా-బంగ్లాదేశ్ ల మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది. భారత్ జట్టులోని ఆటగాళ్లకు తమ సామర్ధ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది ఒక అవకాశంగా చెప్పవచ్చు. 

New Update
T20 World Cup 2024: టీమిండియా బంగ్లాదేశ్ ల మధ్య వార్మప్ మ్యాచ్ ఈరోజే!

India vs Bangladesh Warmup Match: న్యూయార్క్‌లోని క్యాంటీ పార్క్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్లు ఈరోజు వార్మప్ మ్యాచ్ ఆడనున్నాయి. ఇది నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం నుండి 7 కి.మీ దూరంలో ఉంది. టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) ప్రారంభానికి ముందు ఇదే చివరి వార్మప్ మ్యాచ్. మరోవైపు విరాట్ కోహ్లీ న్యూయార్క్ చేరుకున్నాడు. కానీ, ఈ వార్మప్ మ్యాచ్ లో అతను ఆడటం లేదు. 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టులో భారత అత్యుత్తమ T-20 ఆటగాళ్లు ఉన్నారు.  వీరిలో చాలామంది ఇప్పుడే హై వోల్టేజ్ IPL ఆడారు. జట్టు కోచ్, కెప్టెన్ - మేనేజ్‌మెంట్ సరైన టీమ్ సెట్ చేయాలని చూస్తున్నారు. . అందుకు ఈ వార్మప్ మ్యాచ్ ఒక పెద్ద అవకాశంగా చెప్పవచ్చు. ఇక కొంతమంది భారత ఆటగాళ్లకు, ఈ వార్మప్ మ్యాచ్ లో వారు తమ అత్యుత్తమ ప్రదర్శనను అందించడం ద్వారా జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు వేదికగా ఉపయోగపడుతుంది.  

బంగ్లాదేశ్ ముందు ఉన్న సవాలు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం.  ఎందుకంటే భారత్‌తో జరిగిన చివరి 5 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 4 ఓడిపోయింది. వీటిలో 2022 T-20 వరల్డ్ కప్ మ్యాచ్ కూడా ఉంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. విరాట్ ఇన్నింగ్స్ 64 పరుగులతో బంగ్లాదేశ్‌కు 185 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. అర్ష్‌దీప్, హార్దిక్ 2-2 వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ జట్టును 145 పరుగులకే పరిమితం చేశారు.

T20 World Cup 2024: రెండు జట్ల మధ్య 13 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు బంగ్లాదేశ్ ఎప్పుడూ గెలవలేదు. ఇందులో భారత్ 12 మ్యాచ్‌లు గెలవగా, బంగ్లాదేశ్ 1 గెలిచింది. టి-20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు 4 సార్లు తలపడగా బంగ్లాదేశ్ నాలుగింటిలోనూ ఓడిపోయింది.

Also Read: హార్థిక్ ఆశలపై నీళ్లు చల్లుతున్న శ్రేయస్ ఆయ్యర్!

ఈరోజు మ్యాచ్ వివరాలు...
వార్మప్ మ్యాచ్ - భారత్ vs బంగ్లాదేశ్
జూన్ 1 - కాంటీ కె పార్క్, న్యూయార్క్
టాస్ - 7:30 PM, మ్యాచ్ ప్రారంభం - 8:00

జూన్2 నుంచి ప్రపంచ కప్ పోటీలు..
T20 World Cup 2024: జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న T20 ప్రపంచ కప్ 2024 ప్రారంభ మ్యాచ్‌లో అమెరికా, కెనడా జట్లు తలపడనున్నాయి. జూన్ 5న భారత జట్టు ప్రపంచకప్‌ పోరాటాన్ని ప్రారంభిస్తుంది.  తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది.

అలాగే జూన్ 9న న్యూయార్క్‌లో జరిగే హైవోల్టేజ్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. జూన్ 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

2 దేశాలలో T20 ప్రపంచ కప్:
ఈ ప్రపంచకప్‌ను వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దీని ప్రకారం, USA లీగ్ స్థాయిలో కొన్ని మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వగా, సూపర్-8 స్థాయి అన్ని మ్యాచ్‌లు వెస్టిండీస్‌లో ఆడబడతాయి. ఈ టోర్నీ పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు