Healthy Heart :ఈ దుంపతో మీ గుండె పదిలం :మారుతోన్న జీవన శైలితో ఆహార అలవాట్లలోనూ మార్పులొచ్చాయి.తద్వారా గుండె జబ్బులకు గురౌతున్నారు గుండె ఆరోగ్యంగా ఉండటంలో చిలగడ దుంప పాత్ర చాలా కీలకం By Nedunuri Srinivas 03 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Sweet Potato For Healthy Heart : మారుతోన్న జీవన శైలితో ఆహార అలవాట్లలోనూ మార్పులొచ్చాయి. జంక్ ఫుడ్స్కు అలవాటుపడిన జనాలు ఆరోగ్యసమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. తద్వారా గుండె సంబంధించిన సమస్యల బారిన పడుతుంన్నారు. గుండె ఆరోగ్యంగా ఉండటంలో చిలగడ దుంప పాత్ర చాలా కీలకం. గుండె సమస్యల నుంచి రక్షణ చిలగడదుంప పల్లెటూళ్లలో విరివిగా లభిస్తుంది. తియ్యగా రుచికరంగా అందుబాటుధరలో ఉంటూ అందరూ ఇష్టపడితినే ఈ చిలగడదుంప ఉడకపెట్టి తిష్టంగా తింటూ ఉంటారు. కూర వండుకునితిన్నా , కాల్చుకొని తిన్నా సూపర్ టెస్ట్ గా ఉంటుంది. పోషక విలువలు ఎక్కువగా ఉండే ఈ దుంపతోఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ దుంపలో విటమిన్ ఏ, B-6, సీ, డీ, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. చిలగడదుంప మన డైట్‌లో చేర్చుకుంటే.. గుండె సమస్యల నుంచి రక్షణ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది మన శరీరంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉంటె గుండె సమస్యలు తప్పకుండా వస్తాయి. ఈ చిలగడ దుంపల్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. కరిగే, కరగని ఫైబర్ రెండూ సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్ కొలెస్ట్రాల్ కణాలను బంధించి.. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను శరీరం నుంచి బయటకు తీసుకువెళ్తుంది. తద్వారా గుండె సమస్యల ముప్పును తగ్గిస్తుంది. రక్తపోటును కంట్రోల్ చేయడంలోకీలక పాత్ర చిలగడదుంపలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును కంట్రోల్‌లో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తగినంత పొటాషియం తీసుకోవడం వల్ల.. శరీరంలో సొడియం ప్రభావాలను నియంత్రిస్తుంది. అది రక్తపోటును కంట్రోల్‌లో ఉంచడానికి, హైపర్‌టెన్షన్ ముప్పు తగ్గించడానికి తోడ్పడుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని పోత్సహిస్తుంది. చిలగడదుంపలో ఉండే విటమిన్లు యాంటీఆక్సిడెంట్‌గా పని చేస్తాయి చిలగడదుంపలో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి, ముఖ్యంగా విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. విటమిన్ సి ధమనులను దెబ్బతినకుండా రక్షిస్తుంది. విటమిన్ సి శరీరంలోని వాపును తగ్గిస్తుంది. గుండె సమస్యలు రావడానికి ఇన్ఫ్లమేషన్ కూడా ఓ కారణం. కొన్ని చిలగడ దుంపలో నారింజ రంగులో ఉంటాయి, దీనికి కారణం బీటా- కెరోటిన్‌లు. బీటా-కెరోటిన్ శరీరంలో విటమిన్ A గా మారుతుంది. బీటా-కెరోటిన్ అనేది యాంటీఆక్సిడెంట్, ఇది గుండె జబ్బులు ముప్పును తగ్గిస్తుంది. ALSO READ:SHABARIMALA: శబరిమల అయ్యప్ప సన్నిదిలొ ఈ వాక్యాన్ని గమనించారా ? చిలగడ దుంపలో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్.. గుండె సమస్యలకు దారితీస్తుంది. చిలగడదుంపల్లో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. అంతర్గత అవయవాల వాపుని తగ్గిస్తాయి. ఇవి తరచూ మన డైట్‌లో చేర్చుకుంటే.. శరీరంలో వాపును తగ్గిస్తాయి, తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఫైబ్రినోజెన్ రక్తం గడ్డకట్టకుండా సాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి. సాధారణ బంగాళదుంపలతో పోలిస్తే చిలగడదుంపల్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి. ఇది పరోక్షంగా గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది, ఎందుకంటే రక్తంలో అధిక చక్కెర స్థాయిలు.. హృదయనాళ వ్యవస్థకు హాని చేస్తాయి.ఎంత మంచి ఆహరం తీసుకున్నా సరే .. గుండె సమస్యలు ఉన్నవారు సకాలంలో వైద్యులను సంప్రదించి సూచనలు పాటించడం మంచిది. ALSO READ:Lizard Facts : బల్లి మీద పడితే ఇలా చేయండి ? అంతా శుభమే !! #health-tips #healthy-foods #heart-health #healthy-heart #sweet-potato మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి