Swachh Survekshan Awards:క్లీన్ సిటీల్లో టాప్ టెన్‌లో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మరోసారి నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో టాప్ టెన్‌లో మన తెలుగు రాష్ట్రాలు నాలుగు కూడా చోటు దక్కించుకున్నాయి. By Manogna alamuru 11 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Swachh Survekshan Awards:దేశంలోనే పరిశుభ్ర నగరాలల్లో తెలుగు రాష్ట్రాలు సత్తా చాటుకున్నాయి. టాప్ టెన్ లో నాలుగు మనవే ఉన్నాయి. ఇక టాప్ నంబర్ వన్ క్లీస్ సిటీగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఏడోసారి నిలిచింది. 2023 సంవత్సరానికి గానూ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రకటించారు. ఇందులో దేశంలో అరిశుభ్రంగా ఉండే నగరాల లిస్ట్‌ను ప్రకటించింది. అయితే ఈసారి ఇండోర్‌తో పాటూ గుజరాత్‌లోని సూరత్ కూడా మొదటి స్థాన్ని దక్కించుకుంది. రెండు ఊర్లు సంయుక్తంగా మొదటి స్థానం అవార్డును పంచుకున్నాయి. Also read:అయోధ్యకు వెళ్ళేందుకు తెలుగు వారికోసం రెండు ప్రత్యేక రైళ్ళు టాప్ టెన్‌లో తెలుగు రాష్ట్రాలు.. ఇక టాప్ టెన్‌లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్‌లో ప్లేస్ సంపాదించుకున్నాయి. ఇందులో వైజాగ్ 4వ స్థానంలోనూ, విజయవాడ 6వ స్థానం, తిరుపతి 8వ స్థానం, హైదరాబాద్ 9 వసాథానాలను దక్కించుకున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పురి పాల్గొన్నారు. పరిశుభ్రతలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. STORY | Indore, Surat 'cleanest cities' in India: Swachh Survekshan Awards 2023 READ: https://t.co/SWphG6hLg3 (PTI Photo) #SwachhSurvekshanAwards pic.twitter.com/rhelYJ4bl8 — Press Trust of India (@PTI_News) January 11, 2024 President Droupadi Murmu's address at the presentation of Swachh Survekshan Awards - 2023 in New Delhi https://t.co/WbKfxgJfm4 — President of India (@rashtrapatibhvn) January 11, 2024 #tirupathi #vijayawada #hyderabad #india #cites #swachh-survekshan-awards #vishakha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి