Supreme Court: మహిళ గర్భవిచ్ఛిత్తి కేసు.. సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే.. మహిళ గర్భవిచ్ఛిత్తి కేసుకు సంబంధించిన విషయంలో పిండం పరిస్థితిపై నివేదిక సమర్పించాలని శుక్రవారం సుప్రీంకోర్టు.. ఎయిమ్స్ వైద్య మండలిని కోరింది. గతంలో వారు ఇచ్చినటువంటి నివేదికలో పిండం పరిస్థితి సాధారణంగా ఉందని చెప్పారు. అయితే ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు ఆస్కారం లేకుండా వివరంగా మరోసారి నివేదిక ఇవ్వండని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రల ధర్మాసనం తెలిపింది. By B Aravind 14 Oct 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి మహిళ గర్భవిచ్ఛిత్తి కేసుకు సంబంధించిన విషయంలో పిండం పరిస్థితిపై నివేదిక సమర్పించాలని శుక్రవారం సుప్రీంకోర్టు.. ఎయిమ్స్ వైద్య మండలిని కోరింది. గతంలో వారు ఇచ్చినటువంటి నివేదికలో పిండం పరిస్థితి సాధారణంగా ఉందని చెప్పారు. అయితే ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు ఆస్కారం లేకుండా వివరంగా మరోసారి నివేదిక ఇవ్వండని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రల ధర్మాసనం తెలిపింది. ప్రసవానంతర కుంగుబాటును ఎదుర్కొనేందుకు మహిళ.. ఔషధాలను వాడుతున్నారని.. ఆ అంశాన్నీ పరిశీలించాలని సుప్రీం ధర్మాసనం ఎయిమ్స్ వైద్యులను కోరింది. ఈ ఔషధాల వినియోగించడం వల్ల ఆమె గర్భంపై పడే ప్రభావాన్ని అంచనా వేయాలని చెప్పింది. ఇదిలా ఉండగా.. ఇద్దరు పిల్లలున్న ఓ 27 ఏళ్ల మహిళ అబార్షన్ చేసుకునేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. Also Read:ఆపరేషన్ అజయ్-ఢిల్లీకి చేరుకున్న 235మంది భారతీయులు గత ప్రసవాలు జరిగినప్పటి నుంచి తాను కుంగుబాటుతో ఇబ్బంది పడుతున్నానని దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఆమె తెలిపారు. మానసికంగా, ఆర్థికంగా తాను మూడో బిడ్డను కని, పెంచే పరిస్థితుల్లో లేనని వివరించారు. అయితే ఈ పిటిషన్‌పై మొదట విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం.. ఆమె గర్భవిచ్ఛిత్తి చేసుకునేందుకు అక్టోబరు 9న అనుమతి ఇచ్చింది. అయితే ఆ ఉత్తర్వులను రికాల్ చేయాలని అభ్యర్థిస్తూ కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. పిండం బతికే అవకాశాలు ఉన్నాయని ఎయిమ్స్ వైద్యులు తాజాగా ఇచ్చిన నివేదికను ప్రస్తావించింది కేంద్రం. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం తాజాగా పిండం పరిస్థితిపై మరోసారి నివేదిక సమర్పించాలని కోరింది. #supreme-court #abortion #supreme-court-of-india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి