Health Tips: పరగడుపున ఈ టీ తాగితే సూపర్ బెనిఫిట్స్ మన కిచెన్‌లో ఎన్నో అద్భుత మూలికలు ఉన్నాయి. ఇందులో ఓ రెండు మూలికల నీటిని కలిపి తాగితే చాలా లాభాలున్నాయి. అవే సోంపు, యాలకులు. ఇవి రెండు కూడా వేర్వేరుగా ప్రత్యేక గుణాలు కలిగి ఉన్నాయి. సాధారణంగా ఫుడ్ తిన్నాక చాలా మంది వీటిని తీసుకుంటారు. దీని వల్ల జీర్ణ సమస్యలతో పాటు నోటి దుర్వాసన కూడా దూరమవుతుంది. By Manogna alamuru 16 Sep 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి మన కిచెన్ లో దొరికే సోంపు, యాలకులు వాడడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. సోంపులో ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్‌లు ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రెగ్యులర్‌గా వీటిని తీసుకోవడం మంచిది. సోంపు, యాలకుల టీ.. ఈ రెండింటితో కలిపి టీ తయారు చేయొచ్చు. ఈ టీని ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇమ్యూనిటీని పెంచుతాయి. సీజనల్, ఇన్ఫెక్షన్ల కారణంగా వచ్చే సమస్యల్ని ఈ టీ దూరం చేస్తుంది. యాలకులు.. యాలకుల్లో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియంలు ఉంటాయి. వీటితో పాటు విటమిన్స్, రైబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందుకే వీటిని ఎన్నో ఔషధాల తయారీలోని వాడుతున్నారు నిపుణులు. జీర్ణక్రియ.. యాలకులు, సోంపు మరిగించుకుని టీ తాగడం వలన ఎన్నో లాభాలున్నాయి. ఈ టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా మారుతుంది. దీనిని తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది. ఈ టీని తాగితే పేగు కదలికలు మెరుగవుతాయి. ఈ టీని రోజూ ఉదయం పరగడపున తాగితే మలబద్ధకం, అసిడిటీ, అజీర్ణం సమస్యలు తగ్గుతాయి. పీరియడ్స్ ప్రాబ్లమ్స్.. కొంతమంది మహిళల్లో ఇరెగ్యులర్ పీరియడ్స్ సమస్య ఉంటుంది. అలాంటి వారు ఈ యాలకులు, సోంపుతో తయారైన టీని తీసుకుంటే ఆ సమస్య చాలా వరకూ దూరమవతుంది. ఇందులోని విటమిన్లు, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు సమస్యని తగ్గిస్తాయి. అంతేనా, పీరియడ్స్ టైమ్‌లో వచ్చే నొప్పులు కూడా దూరమవుతాయి. వాపు.. సోంపు, యాలకుల టీ తాగడం వల్ల శరీరంలో వాపు సమస్య తగ్గుతుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో బాడీలోని ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. ఈ టీని రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు, వాపు వంటి సమస్యలు దూరమవుతాయి. బరువు తగ్గడం.. ఎంతో మంది బరువు తగ్గాలని ట్రై చేస్తుంటారు. అలాంటి వారు ఉదయాన్నే ఈ టీని తాగితే అందులోని ఫైబర్, ఆక్సిడెంట్స్, బాడీలోని అదనపు కొవ్వుని తగ్గిస్తాయి. దీనిని రెగ్యులర్‌గా తాగితే జీవక్రియ పెరిగి బరువు కంట్రోల్‌లో ఉంటుంది. #helath #tea #home #kitchen #benifits #remidies #elachi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి