Osmania University: ఓయూలో విద్యార్థుల ఆందోళన.. అధికారుల తీరుపై ఆగ్రహం ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టల్స్‌లో కనీస మౌలిక సదుపాయలు కల్పించడం లేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వేసవిలో మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేని పరిస్థితి ఉందని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించేవరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. By B Aravind 28 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Protest At Osmania University: హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. హాస్టల్స్‌లో కనీస మౌలిక సదుపాయలు కూడా కల్పించడం లేదని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వేసవి కాలంలో కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేని పరిస్థితి ఉందని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 15 రోజుల నుంచి తాము హాస్టల్స్‌లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. Also read: సూర్యాపేటలో విషాదం.. ప్రేమ పెళ్లి నిరాకరించారని ప్రేమ జంట ఆత్మహత్య తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు కూడా విజ్ఞప్తి చేశామని చెప్పారు. అయినప్పటికీ కూడా వాళ్లు విద్యార్థులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అధికారులు.. హాస్టల్స్‌లో కనీస మౌలిక వసతులు కల్పించకపోవడం ఏంటంటూ నిలదీస్తున్నారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరేవరకు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నీళ్లు కావాలంటూ ఓయూలో అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళన ఓయూలో అర్ధరాత్రి తాగడానికి, వాడుకోవడానికి నీళ్లు కూడా లేవని రోడ్డు మీద బైఠాయించి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పందించలేదని వాపోయారు. ఉదయం నుంచి నీళ్లు లేవని మొర పెట్టుకుంటే రాత్రి ఒక్క… pic.twitter.com/n95xPNs4vY — Telugu Scribe (@TeluguScribe) April 28, 2024 #telugu-news #telangana-news #osmania-university #osmania-university-students మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి