Watch Video: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ప్రచార వేదిక.. 9 మంది మృతి

మెక్సికో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో విషాదం చోటుచేసుకుంది. ఈదురుగాలుల ప్రభావానికి ప్రచార వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 63 మంది గాయాలపాలయ్యారు.

New Update
Watch Video: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ప్రచార వేదిక.. 9 మంది మృతి

Stage Collapse In Mexico Kills 9: మెక్సికో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో విషాదం చోటుచేసుకుంది. ఈదురుగాలుల ప్రభావానికి ప్రచార వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర మెక్సికోలోని న్యూవో లియోన్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. త్వరలో మెక్సికోలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార, విపక్ష పార్టీల అభ్యర్థలు ఎన్నికల ప్రచారంలోకి దిగారు. ఈ క్రమంలోనే అధ్యక్ష అభ్యర్థి జార్జ్ అల్వారెజ్ మేనెజ్‌ (Jorge Alvarez Maynez) ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో బలమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో ఒక్కసారిగా స్టేజీ కూలిపోయింది.

Also Read: జులై 4న ఇంగ్లండ్‌లో సార్వత్రిక ఎన్నికలు..ఓటర్లను ఎదుర్కొననున్న ప్రధాని రిషి సునక్!

ఈ ప్రమాందలో 9 మంది మృతి చెందగా.. మరో 63 మంది గాయాలపాలయ్యారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసుల, సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. అధ్యక్ష అభ్యర్థి జార్జ్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఈ క్రమంలో కొన్ని రోజుల పాటు ప్రచారాన్ని వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై మెక్సికన్ అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యుయెల్ విచారం వ్యక్తం చేశారు. ఘటనలో మరణించిన మృతుల కుటంబాలకు సంతాపం తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Also Read: అంగారకుడిపై గ్రహాంతర వాసుల కోసం నాసా వేట!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

నౌకాశ్రయంలో భారీ పేలుడు.. 400 మందికి పైగా?

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

New Update
Iran Harbor

Iran Harbor

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించిన ఘటన చోటుచేసుకుంది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలో రజేయీ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ భారీ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

చమురు, పెట్రోకెమికల్స్ కారణంగా..

నౌకాశ్రయంలోని కంటెయినర్ల నుంచి పేలుడు సంభవించిందని భావిస్తున్నారు. ఇక్కడ ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఈ కంటైయినర్లలో చమురు, పెట్రోకెమికల్స్ ఉన్నాయి. వీటి కారణంగా పేలుడు సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment