Infection: చైనాలో విజృంభిస్తున్న వింత ఫ్లూ..చిన్న పిల్లలే దీని టార్గెట్ చైనాలో ప్రబలుతోన్న వింత ఇన్ఫెక్షన్ పిల్లలను టార్గెట్ చేసింది. జ్వరం పిల్లలలో ఇన్ఫెక్షన్ లాగా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖానికి మాస్క్ ధరించడం, ఉదయం ఇంటి నుంచి బయటకు రాకపోవడం, తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవడం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది. By Vijaya Nimma 01 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Infection: ఎక్కువగా పిల్లలను టార్గెట్ చేస్తూ చైనాలో ప్రబలుతోన్న వింత ఇన్ఫెక్షన్ ఇండియాలోనూ వణుకు పుట్టిస్తోంది. సాంకేతికతలో అందరినీ మించిపోతున్న చైనా కూడా ప్రపంచానికి రోగాలను కంట్రిబ్యూట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. భయంకరమైన వ్యాధులను పరిచయం చేసే సామర్థ్యం చైనా సొంతం. తాజాగా చైనాలో చిన్నారుల్లో వింత ఫ్లూ ప్రబలుతోంది. పిల్లలను టార్గెట్ చేసే వైరస్: నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ జ్వరం పిల్లలలో ఇన్ఫెక్షన్ లాగా వ్యాపిస్తుంది. పిల్లలలో శ్వాసకోశ సమస్యలు సాధారణం. చైనీస్ ఆరోగ్య అధికారుల ప్రకారం ఈ ఫ్లూ న్యుమోనియా, RSV, అడెనోవైరస్, ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వల్ల వస్తుందని చెబుతున్నారు. భారత్‌లోనూ వణుకు: మన భారతదేశంలోనూ చైనీస్ ఫ్లూ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ఇన్ఫెక్షన్‌ను ఎదుర్కోవడానికి భారత్ సిద్ధం కావాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఈ వ్యాధి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఫ్లూ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని అంటున్నారు. చైనీస్ ఫ్లూ లక్షణాలు ఇవే: చాలా మంది పిల్లల్లో జ్వరం, గొంతునొప్పి, ఆయాసం ఎక్కువగా ఉంటాయని అక్కడి ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా కనిపిస్తోందని అంటున్నారు. ప్రధానంగా న్యుమోనియా అనేది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్. ఊపిరితిత్తుల లోపలి భాగం నీరు లేదా చీముతో నిండి ఉండటం వల్ల బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుందని చెబుతున్నారు. పిల్లల్లో వాంతులు, విరేచనాలు: వాంతులు, విరేచనాలు కూడా కొంతమంది పిల్లలలో ఎక్కువగా కనిపిస్తాయి. బీజింగ్, లైనింగ్ ప్రావిన్స్‌లలో ఇటీవల ఈ చైల్డ్ ఫీవర్ కనిపించింది. దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. అది RSV, బ్యాక్టీరియా లేదా మైకోప్లాస్మా కావచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. ముందుజాగ్రత్తలు: చలికాలంలో ఊపిరి ఆడకపోవడం సాధారణం. కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నట్టు ముఖానికి మాస్క్ ధరించడం, ఉదయం ఇంటి నుంచి బయటకు రాకపోవడం, అనారోగ్యంగా అనిపించినప్పుడు మంచి విశ్రాంతి తీసుకోవడం మంచిదని అంటున్నారు. అంతేకాకుండా తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవడం చేయాలని చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ఒక్కసారిగా బీపీ తగ్గితే ఏం చేయాలి?.. ఈ చిట్కాలు ఫాలో అవండి గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #children #health-benefits #china #strange-infection మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి