Stock Market Today: రెండు రోజులుగా నష్టాలో దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు

గత నాలుగు రోజులుగా దేశీ స్టాక్ మార్కెట్లు మళ్ళీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం కూడా మార్కెట్ సూచీలు నష్టాలతోనే ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.24 గంటల సమయంలో సెన్సెక్స్ 491 పాయింట్ల నష్టంతో 63,557 దగ్గర...నిఫ్టీ 156 పాయింట్ల నష్టంతో 18,966 దగ్గర కొనసాగుతోంది.

New Update
Stock Market Today: రెండు రోజులుగా నష్టాలో దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు

Stock Market Today: బలహీనమైన ప్రపంచ మార్కెట్ల సంకేతాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు, సెన్సెక్స్, నిఫ్టీ గురువారం ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతుండగా, ట్రెజరీ రాబడులు పెరగడంతో యూఎస్ స్టాక్ సూచీలు కూడా నిన్న బాగా నష్టాల్లో ముగిశాయి. వడ్డీ రేట్లు ఎక్కువ కాలం ఉండవచ్చనే భయాలను పునరుద్ధరించాయి. నిన్న నమోదైన నష్టాలు ఈరోజు కూడా కొనసాగాయి. సెన్సెక్స్ (Sensex) మళ్ళీ 500 పాయింట్ల నష్టానికి చేరువైంది. నిఫ్టీ (Nifty) అయితే 19000 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఉదయం మార్కెట్ ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 491 పాయింట్ల నష్టంతో 63,557 దగ్గర...నిఫ్టీ 156 పాయింట్ల నష్టంతో 18,966 దగ్గర ట్రేడవుతున్నాయి.

Also Read:13 మంది ప్రాణాలు తీసిన పొగమంచు

టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీలు భారీ నష్టాల్లోకి జారుకోగా...యాక్సిస్ బ్యాంక్ షేర్లు మాత్రం లాభాల బాటలో పయనిస్తున్నాయి. మొత్తం 30 సూచీల్లో ఒకే ఒక్క షేర్ మాత్రమే లాభాల్లో ఉంది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.20 దగ్గర ప్రారంభమైంది.

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం అంటే నిన్న భారీ నష్టాలను చవిచూశాయి. తీవ్ర అమ్మకాల ఒత్తిడితో సూచీలు వరుసగా రెండో సెషన్ లోనూ క్షీణత నమోదు చేశాయి. ఉదయం సెషన్లో స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. విపరీతమైన అమ్మకాల కారణంగా మళ్లీ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 523 పాయింట్లు పతనమై 64,049 పాయింట్లకు పడిపోయింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 160 పాయింట్లు నష్టపోయి 19,122 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఐదు సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ. 15 లక్షల కోట్లు ఆవిరైంది. బీఎస్‌ఈ (BSE) లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 323.82 లక్షల కోట్ల నుంచి రూ. 308.73 లక్షల కోట్లకు పడిపోయింది.

ఇక నిన్న అమెరికా మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చడంతో ఏర్పడిన అనిశ్చితి, అమెరికా బాండ్ ఈల్డ్ లు పెరగడం, ప్రముఖ కార్పొరేట్ సంస్థల సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండటం వంటి కారణాలు మార్కెట్లను నెగెటివ్ గా ప్రభావితం చేశాయి.

Advertisment