Stock Market Today :మళ్ళీ డౌన్‌లోకి వచ్చేసిన స్టాక్ మార్కెట్స్ మొన్న లాభాలతో ముగించి నిన్నంతా లాభాల్లో కొనసాగిన దేశీ మార్కెట్లు ఈరోజు మళ్ళీ నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 102 పాయింట్లతో 66,325 దగ్గర, నిఫ్టీ 18 పాయింట్లు నష్టపోయి 19,792 దగ్గర కొనసాగుతోంది. By Manogna alamuru 18 Oct 2023 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి Stock Market Today: దేశీయ మార్కెట్ల లాభాలు ఒక్కరోజు ముచ్చటలా అయింది. నిన్న లాభాల్లో కొనసాగినా...అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల ప్రభావంతో ఈరోజు నష్టాలతో మొదలయ్యాయి. ఇజ్రాయెల్- హమాస్ (Israel - Hamas) ఉద్రిక్తతలు మరింత పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ (Sensex) 102 పాయింట్లతో 66,325 దగ్గర, నిఫ్టీ (Nifty) 18 పాయింట్లు నష్టపోయి 19,792 దగ్గర కొనసాగుతోంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.22 దగ్గర ప్రారంభమైంది. ఇవాళ్టి ట్రేడింగ్ లో బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్ కార్ప్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్టీఐ మైండ్ ట్రీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు (Shares) నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, హిండాల్కో, సన్ ఫార్మా,దివిస్ ల్యాబ్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సిప్లా, రిలయన్స్, టాటా మోటార్స్ షేర్లు మోస్ట్ యాక్టివ్ గా ఉన్నాయి. ఇక అమెరికా మార్కెట్లు నిన్న మిశ్రమంగా ముగిసాయి. ఆసియా-పసిఫిక్ సూచీలు మాత్రం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. Also Read: నేటి నుంచి మూడురోజులు కాంగ్రెస్ బస్సు యాత్ర గాజా ఆసుపత్రి మీద దాడితో ఇప్పటికే గందరగోళంగా ఉన్న పరిణామాలను మరితం ఆందోళనకు గురిచేసింది. అయితే పరిస్థితి అధ్వాన్నంగా మారదని అనుకుంటున్నామని అంటున్నారు మర్కెట్ అనలిస్ట్‌లు. విషాద భౌగోళిక రాజకీయ పరిణామాలు ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు స్థిరంగానే ఉన్నాయి. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా కొనసాగుతోంది. దీనివలన ఇతర మార్కెట్లు కూడా బలంగా అవ్వడానికి సహకారం అందుతుంది. రెండోది, మార్కెట్ అభిప్రాయం ఏమిటంటే యూఎస్ ఫెడ్ అమెరికా ఆర్థిక వ్యవస్థను సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంలో, మాంద్యం నుండి తప్పించుకోవడంలో విజయం సాధిస్తుంది. Also Read: గాజా ఆసుపత్రిలో పేలిన బాంబు, 500మంది మృతి #stock-market-today #shares #share-market-today మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి