Stock Market: లాభాల బాటలో స్టాక్ మార్కెట్.. గత వారం మార్కెట్ ఇలా.. 

స్టాక్ మార్కెట్ వరుస నష్టాల తరువాత గత వారం లాభాల బాట పట్టింది. ఈ వారంలో బిఎస్‌ఇ సెన్సెక్స్ 283 పాయింట్ల లాభంతో 64,364 పాయింట్ల వద్ద నిఫ్టీ 50 97 పాయింట్ల లాభంతో 19,231 పాయింట్ల వద్ద నిలిచాయి. 

New Update
Stock Market: లాభాల బాటలో స్టాక్ మార్కెట్.. గత వారం మార్కెట్ ఇలా.. 

Stock Market Today: నిత్యం ఆటుపోట్లు.. పడుతూ లేస్తూ కదిలే ఇండెక్స్ లు.. ఒక్కరోజులో ఆవిరి అయిపోయే కోట్లాది రూపాయలు.. గంటలో వచ్చి పడే లాభాల సంపద.. స్టాక్ మార్కెట్(Stock Market) ఇన్వెస్టర్స్ కి ఎప్పుడూ ఉండే అనుభవాలు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారు మార్కెట్లో ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను చూసుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. స్టాక్ మార్కెట్ నిన్నటి పనితీరు ఎలా ఉంది? అనేది ఈరోజు ఇన్వెస్ట్ చేయవచ్చా లేదా అనే విషయంపై కనీస అవగాహన కల్పిస్తుంది. ఇక సోమవారం నుంచి శుక్రవారం వరకూ మార్కెట్ ఇండెక్స్ లు ఎలా కదిలాయి.. కారణాలు ఏమి అయి ఉండవచ్చు.. టాప్ గెయినర్స్ ఎవరు.. లూజర్స్ ఎవరు వంటి విషయాలను వారాంతంలో అంచనా వేయడం ఇన్వెస్టర్స్ కి అవసరం. ఇప్పుడు గత వారం అంటే అక్టోబర్ 30 నుంచి నవంబర్ 3 వతేదీ వరకూ మార్కెట్ పరిస్థితిని ఒకసారి తెలుసుకుందాం. 

వరుసగా వస్తున్న నష్టాల బాట నుంచి గత వారం స్టాక్ మార్కెట్లు(Stock Market) కాస్త కోలుకున్నాయి. శుక్రవారం అంటే నవంబర్ 3వ తేదీన స్టాక్ మార్కెట్లో పెరుగుదల నమోదు అయింది. సెన్సెక్స్ 30 షేర్లలో 20 షేర్లు లాభాల బాట పట్టడంతో 282 పాయింటా లాభంతో 64,363 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 97 పాయింట్ల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 19,230 వద్ద క్లోజ్ అయింది. ఇక వారం మొత్తంగా చూసుకుంటే అంటే అక్టోబర్ 30, సోమవారం నుంచి నవంబర్ 3 శుక్రవారం వరకూ వారంలో ప్రయివేట్ బ్యాంకులు, ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ల మంచి పనితీరుతో బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex), నిఫ్టీ (Nifty) ఇండెక్స్ లు రెండూ పైకి కదిలాయి. కంపెనీల రెండో త్రైమాసిక ఫలితాలు ఆకట్టుకునేలా వెలువడుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ఇండెక్స్(Stock Market Index) లు ఈ వారం పుంజుకున్నాయి. దానికి తోడు బ్రోకరేజ్ నోట్స్ కూడా అనుకూలంగా ఉండడం కూడా ఈ పెరుగుదలకు కారణంగా నిలిచింది. 

గత వారంలో ఇండెక్స్ ఎన్ని పాయింట్లు లాభపడిందో ఈ చార్ట్ లో చూడవచ్చు:

ఇండెక్స్ 

పెరిగిన పాయింట్లు  ముగింపు 

బిఎస్‌ఇ సెన్సెక్స్

283  64,364

నిఫ్టీ 50

97

19,231

మిడ్‌క్యాప్ ఇండెక్స్ 275

39,587 

నిఫ్టీ బ్యాంక్ 301

39,587

Stock Market: నిఫ్టీ టాప్ గెయినర్లలో అపోలో హాస్పిటల్స్, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్ టైటాన్ కంపెనీలు ఉన్నాయి. ఆలాగే నష్టాలు నమోదు చేసిన జాబితాలో TCS,  బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, SBI లైఫ్ ఇన్సూరెన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్ ఉన్నాయి. మొత్తమ్మీద చూసుకుంటే గత వారంలో స్టాక్ మార్కెట్ ముందంజ వేయడం. వరుస నష్టాల నుంచి కోలుకోవడం శుభసూచకం అనే చెప్పాలి. వచ్చేవారం కూడా మార్కెట్ ఇదే సానుకూలధోరణి చూపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

గమనిక: షేర్లలో ఇన్వెస్ట్ చేయడం అత్యంత రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఇక్కడ అందించిన సమాచారం మార్కెట్ ధోరణులపై వచ్చిన సమాచారం ఆధారంగా ఇవ్వడం జరిగింది. ఈ ఆర్టికల్ ఈ షేర్ లో పెట్టుబడి పెట్టమని కానీ, పెట్టుబడి విషయంలో ఇలా చేయండి అని కానీ, సూచించడం లేదు. ఇది కేవలం ఇన్వెస్టర్స్ సమాచారం కోసం మాత్రమే అందించడం జరిగింది. ఎవరైనా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే ముందు వారి ఆర్థిక సలహాదారుని సూచనలు తీసుకోవడం మంచిది.

Please Watch this Interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు