Stock Market Updates : కోలుకుంటున్న స్టాక్ మార్కెట్.. లాభాల్లో సెన్సెక్స్-నిఫ్టీ!

నిన్న భారీ పతనాన్ని చూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 1200 పాయింట్ల లాభంతోనూ నిఫ్టీ 300 పాయింట్ల లాభంతోనూ దూసుకెళ్లాయి. ఆ తరువాత కాస్త కిందికి దిగివచ్చినప్పటికీ.. నిన్నటితో పోలిస్తే లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.  

New Update
Stock Markets: భారీ నష్టాల తరువాత వరుసగా రెండో రోజు లాభాల్లో దేశీ మార్కెట్లు

Stock Market Updates Today : నిన్న ఇన్వెస్టర్స్ (Investors) కి రక్త కన్నీరు తెపించిన తరువాత ఈరోజు మార్కెట్లు పుంజుకుంటున్నాయి. అమెరికా (America) లో రెండు సంవత్సరాల తరువాత అత్యంత దారుణంగా మార్కెట్లు పడిపోయినా.. దేశీయంగా మాత్రం ప్రస్తుతం ఆ ప్రభావం కనిపించడం లేదు. ఈరోజు అంటే ఆగస్టు 6న మార్కెట్ ప్రారంభం కావడంతోనే ఇండెక్స్ లు పైకి కదిలాయి.  మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 1200 పాయింట్ల వరకూ ఎగబాకి 79,972 పాయింట్ల వద్దకు చేరుకుంది. తరువాత కాస్త కిందికి దిగివచ్చి ప్రస్తుతం అంటే ఉదయం 10 గంటల సమయానికి 79670 స్థాయికి చేరుకుంది. నిఫ్టీ కూడా 280 పాయింట్లు పెరిగింది. 24,340 స్థాయిలో ట్రేడవుతోంది.

Stock Market Updates నిన్న నష్టాలు చూసిన సెక్టార్లు ఈరోజు లాభాలతో ప్రారంభం అయ్యాయి. నిఫ్టీ ఆటో, మెటల్, రియాల్టీ సూచీలు 2 శాతానికి పైగా పెరిగాయి.  బ్యాంక్, ఐటీ, మీడియా 1% కంటే ఎక్కువ పెరిగాయి. 50 నిఫ్టీ స్టాక్స్‌లో 45 పెరుగుతున్నాయి. 5 తగ్గుదల కనబరుస్తున్నాయి.  టాటా మోటార్స్ అత్యధికంగా 3% పెరిగింది. SBI లైఫ్‌లో బేస్ శాతం కంటే ఎక్కువ క్షీణత కనిపిస్తోంది. 

ఈరోజు మార్కెట్ గమనాన్ని నిర్ణయించే నాలుగు పెద్ద అంశాలు ఇవే.. 

  1. రిజర్వ్ బ్యాంక్ సమావేశం: రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ సమావేశం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆర్‌బిఐ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ ఆగస్టు 8, 2024న సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి సమాచారాన్ని అందజేస్తారు. ఆర్‌బీఐ వడ్డీ రేట్లను యథాతథంగా 6.5 శాతంగా ఉంచుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
  2. కంపెనీల త్రైమాసిక ఫలితాలు: ఈ వారం 900కు పైగా కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు రానున్నాయి. నేడు టాటా పవర్, టీవీఎస్ మోటార్స్, బాటా, రేమండ్ వంటి కంపెనీలు ఏప్రిల్-జూన్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేయబోతున్నాయి. కంపెనీల ఫలితాలు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయి.
  3. గ్లోబల్ మార్కెట్ మూవ్‌మెంట్: సోమవారం అమెరికా మార్కెట్ డౌ జోన్స్ 2.60% పడిపోయి 38,703 స్థాయి వద్ద ముగిసింది. నాస్‌డాక్ కూడా 3.43 శాతం పడిపోయింది. 16,200 వద్ద ముగిసింది. ఈరోజు ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 10% పెరిగింది. గిఫ్ట్ నిఫ్టీ కూడా 0.81 శాతం పెరిగింది.
  4. విదేశీ - దేశీయ పెట్టుబడిదారులు: విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) ఆగస్టు 5న ₹10,073.75 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అదేసమయంలో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (DII) ₹ 9,155.55 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అంటే విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు జరుపుతున్నారు.

US మార్కెట్
S&P 500 సోమవారం 3% పడిపోయింది.  సెప్టెంబర్ 2022 తరువాత ఇదే అత్యంత దారుణమైన పరిస్థితి. జూలైలో దాని ఆల్-టైమ్ గరిష్ట స్థాయి కంటే ఇండెక్స్ 8.5% కంటే తక్కువగా ఉంది.  అయితే ఇది 2024లో 8.7% పెరిగింది.

Stock Market Updates: మార్కెట్‌ క్షీణించిన విషయంలో టెక్ కంపెనీల స్టాక్‌లు ముందంజలో ఉన్నాయి. యాపిల్ షేర్లు 4.8% క్షీణించగా, మెటా 2.5%, - ఎన్విడియా 6.4% పడిపోయాయి. ఆర్థిక మందగమనం కారణంగా అమెరికా మార్కెట్లలో ఈ క్షీణత సంభవించింది.

ఈ విషయంపై సెబీ (SEBI) సర్టిఫైడ్ స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ ఆర్టీవీతో మాట్లాడుతూ ఇప్పుడు మీ పోర్ట్‌ఫోలియోలో డిఫెన్సివ్ స్టాక్‌లను ఉంచుకోవడం మంచిది అని సలహా ఇస్తున్నారు. యుఎస్ ఉద్యోగ వృద్ధి రేటు చాలా నెమ్మదిగా ఉందని ఆయన  చెప్పారు. దీని కారణంగా మాంద్యం ఏర్పడే అవకాశం ఉంది. ఇది కాకుండా, ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా జియో ఉద్రిక్తతలు కూడా ఉన్నాయి. రూపాయి పతనం కూడా కారణంగా ఉంది. ఈ సమయంలో పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలో ఎఫ్‌ఎంసిజి - ఫార్మా షేర్ల వంటి డిఫెన్సివ్ స్టాక్‌లను కలిగి ఉండాలి. రాబోయే కాలంలో, దేశీయ- ప్రపంచ స్థూల కారకాల కారణంగా మార్కెట్‌లో అస్థిరత ఉండవచ్చని ఆయన వివరించారు. 

Also Read : ఒక్క భయం.. 15 లక్షల కోట్ల ఆవిరి.. స్టాక్ మార్కెట్ పతనంతో భారీ నష్టం!

Advertisment
Advertisment
తాజా కథనాలు