Stock Market: స్టాక్ మార్కెట్ పై ఫెడ్ ప్రకటన ప్రభావం.. లాభాల్లో మార్కెట్లు..

స్టాక్ మార్కెట్ నిన్న పెరుగుదలతో ముగిసింది. సెన్సెక్స్ 489 పాయింట్ల లాభంతో 64,080 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 144 పాయింట్లు పెరిగి 19,133 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌లో 28 స్టాక్స్ ధరలు పెరిగాయి.

New Update
Stock Market : స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ హై..వచ్చే వారం ఎలా ఉంటాయి అంటే?

Stock Market Today: స్టాక్ మార్కెట్ నిన్న అంటే నవంబర్ 2 వ తేదీన పెరుగుదలతో ముగిసింది. సెన్సెక్స్ (Sensex) 489 పాయింట్ల లాభంతో 64,080 వద్ద ముగిసింది. నిఫ్టీ (Nifty) కూడా 144 పాయింట్లు పెరిగి 19,133 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌లో 28 స్టాక్స్ ధరలు పెరిగాయి. రెండు స్టాక్స్ మ్యాత్రమే తగ్గాయి. నవంబర్ 1 వతేదీ న కింది స్థాయిలో ముగిసిన సెన్సెక్స్ నిన్న పెరుగుదల కనపరచింది.

నిఫ్టీలో అపోలో హాస్పిటల్స్, ఐషర్ మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందాల్కో ఇండస్ట్రీస్, బ్రిటానియా ఇండస్ట్రీస్ లాభాలను చూశాయి. ఓఎన్జీసీ, బజాజ్ ఆటో, హెచ్ డి ఎఫ్ సి లైఫ్ హీరో మోటోకార్ప్ షేర్లు నష్టాలు నమోదు చేశాయి. ఇక రియల్ ఎస్టేట్, మెటల్, ఆయిల్&గ్యాస్, ప్రభుత్వ బ్యాంకుల ఇండెక్స్ లు 2 శాతం దాకా పెరిగాయి.

Also Read: తగ్గినట్టే తగ్గి మళ్ళీ పైకి కదులుతున్న బంగారం.. పండుగ వేళలో పసిడి ప్రియులకు కష్టమే..

మరోవైపు అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ కీలక వడ్డీరేట్లకు సంబంధించి ఒక ప్రకటన చేసింది. ఫెడ్ ఛైర్మెన్ జెరోమ్ పావెల్ వడ్డీ రేట్లను అలాగే కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు. వడ్డీ రేట్లలో మార్పు ఉండదని చెప్పారు. వడ్డీ రేట్లను పెంచే ప్రక్రియ దాదాపు చివరి దశకు చేరుకుందని ఆయన శుభవార్త వినిపించారు. దీంతో మార్కెట్లు (Stock Market) పుంజుకున్నాయి. యూఎస్ మార్కెట్లే కాకుండా ప్రపంచ మార్కెట్లు అన్నీ దాదాపుగా లాభాల్లో ముగిశాయి.

అదానీ పవర్ రెండవ త్రైమాసిక ఫలితాలు:
అదానీ గ్రూప్‌ (Adani Group) నకు చెందిన అదానీ పవర్ లిమిటెడ్ 2023-24 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసిక (జూలై-సెప్టెంబర్) ఫలితాలను నిన్న ప్రకటించింది. Q2FY24లో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన (YoY) 848% పెరిగి రూ.6,594 కోట్లకు చేరుకుంది.

గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.696 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం క్యూ2లో 84.42% పెరిగి రూ.12,990.58 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.7,043.77 కోట్లు.

తగ్గిన దీపక్ ఫెర్టిలైజర్స్ లాభం:
సెప్టెంబర్ త్రైమాసికంలో దీపక్ ఫెర్టిలైజర్స్ నికర లాభం 77 శతం తగ్గింది. ఆదాయం కూడా 11 శాతం తగ్గి రూ.2,424 కోట్లకు చేరుకుంది. దీంతో కంపెనీ షేర్ నిన్న 6.64 శాతం తగ్గి రూ. 595ల వద్ద ముగిసింది.

లాభాలు నమోదు చేసిన గోద్రెజ్ ప్రాపర్టీస్:
జూలై- సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను గోద్రెజ్ ప్రాపర్టీస్ ప్రకటించింది. ఈ త్రైమాసికంలో రూ.66.80 కోట్ల రూపాయల నికర లాభం గోద్రెజ్ ప్రాపర్టీస్ సాధించింది. ఇది సంవత్సరం ప్రతిపాదికన చూస్తే 22 శాతం అధికం కావడం గమనార్హం. దీంతో నిన్న ఈ షేరు 2.99శాతం లాభంతో రూ.1,715ల వద్ద నిలించింది.

Also Read: 2 వేల నోట్లను పోస్టులో పంపండి…ఆర్బీఐ మరో బంపర్‌ ఆఫర్

Advertisment
Advertisment
తాజా కథనాలు