Jobs: అలెర్ట్.. అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ నుంచి కీలక అప్‌డేట్.. ఆ రూల్స్ ఛేంజ్! SSC ఇటివలి కొత్త వెబ్‌సైట్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో రూల్స్ మారాయి. అభ్యర్థులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ మళ్లీ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో తమ లైవ్ ఫొటోను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వెబ్‌క్యామ్ లేదా మొబైల్ నుంచి లైఫ్ ఫొటోను అప్‌లోడ్ చేయాలి. By Trinath 29 Feb 2024 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి New Rules For Applying SSC Jobs: స్టాఫ్ సెలక్షన్ కమీషన్(Selection Staff Commission) కొత్త నోటీసును జారీ చేసింది. అభ్యర్థులు ఇకపై దరఖాస్తు చేసేటప్పుడు తమ పాత ఫొటో పనకిరాదు. కొత్త వెబ్‌సైట్‌లో రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు అభ్యర్థులు వారి లైవ్ ఫొటోను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. SSC ఇటీవల కొత్త వెబ్‌సైట్ ssc.gov.in ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. పాత SSC వెబ్‌సైట్ ssc.nic.in లో వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఏ అభ్యర్థి అయినా మళ్లీ రిజిస్ట్రర్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త వెబ్‌సైట్‌ను విజిట్ చేసి మళ్లీ వివరాలు నమోదు చేసుకోవాలి. కొత్త వెబ్‌సైట్‌లో చేసిన OTR మాత్రమే చెల్లుబాటు అవుతుంది. కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించిన తర్వాత అనేక మార్పులు చేసింది SSC. అవేంటో తెలుసుకోండి. --> కొత్త రిక్రూట్‌మెంట్‌ల కోసం అభ్యర్థులు కొత్త వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తెలిపింది. --> ఈ సమయంలో వారు తమ లైవ్ ఫొటోను తీయాల్సి ఉంటుంది. --> దరఖాస్తు సమయంలో అభ్యర్థి తన ల్యాప్‌టాప్/కంప్యూటర్‌లోని వెబ్‌క్యామ్ లేదా మొబైల్ నుంచి తీసుకున్న లైవ్ ఫొటోను అప్‌లోడ్ చేయాలి. --> ఈ కొత్త నియమాలు అన్ని రిక్రూట్‌మెంట్ పరీక్షలకు వర్తిస్తుంది. CGL, CHSL, CAPF CPO, MTS, GD కానిస్టేబుల్, JE, JHT, స్టెనోగ్రాఫర్‌తో పాటు ఇతర రిక్రూట్‌మెంట్‌లకు వర్తిస్తుంది. ఈ ఎగ్జామ్ రిక్రూట్‌మెంట్‌ల కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు న్యూ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. ఫొటోగ్రాఫ్ తీసేటప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి: --> వెబ్‌క్యామ్ ద్వారా ఫోటోలు తీస్తున్నప్పుడు, అభ్యర్థులు మంచి లైటింగ్, డిసెంట్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ప్లేస్‌ను ఎంచుకోవాలి. --> ఫొటో తీయడానికి ముందు, కెమెరా కంటి స్థాయిలో ఉందని నిర్ధారించుకోండి. --> వెబ్‌క్యామ్ ముందు మిమ్మల్ని మీరు నేరుగా ఉంచండి. స్ట్రైట్‌గా ముందుకు చూడండి. --> లైవ్ ఫొటో తీస్తున్నప్పుడు అభ్యర్థులు క్యాప్, మాస్క్ లేదా గ్లాసెస్ ధరించకూడదు. Also Read: ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. 11,062 పోస్టులను DSC నోటిఫికేషన్! #jobs #ssc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి