పవన్ కల్యాణ్ కు అంత సీన్ లేదనుకున్నా.. శ్రియారెడ్డి కామెంట్స్ వైరల్

శ్రియారెడ్డి స్టార్ హీరో పవన్ కల్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 'ఓజీ' మూవీకోసం పవన్‌ కల్యాణ్‌ను కలిసేంతవరకూ ఆయన పెద్ద స్టార్‌ హీరో అనే విషయమే తెలియదు. ఇంత ఫాలోయింగ్ ఉందని ఎక్స్ పెక్ట్ చేయలేదు. దేవుడితో వర్క్‌ చేస్తున్నావని ఫ్యాన్స్ అంటుంటే ఆనందంగా ఉందని చెప్పింది.

New Update
పవన్ కల్యాణ్ కు అంత సీన్ లేదనుకున్నా.. శ్రియారెడ్డి కామెంట్స్ వైరల్

Sriya Reddy : యంగ్ బ్యూటీ శ్రియారెడ్డి(Sriya Reddy) స్టార్ హీరో పవన్ కల్యాణ్(Pawan Kalyan) గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేంత వరకూ ఆయనెవరో తనకు తెలియదంటూ ఆసక్తికరంగా మాట్లాడింది. ప్రభాస్ హీరోగా వచ్చిన 'సలార్'(Salaar) మూవీలో 'రాధారమ' పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న శ్రియా.. రీసెంట్ ఇంటర్వ్యూలో మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తు్న్నట్లు తెలిపింది. అలాగే తన అప్ కమింగ్ మూవీస్ గురించి కూడా మాట్లాడుతూ.. పవన్ సరసన నటించబోయే 'ఓజీ'గురించి కూడా పలు విషయాలు ప్రస్తావించింది.

‘సలార్‌’ చిత్రంలో 'రాధారమ' పాత్రను పోషించడం తనకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ పాత్ర ఎన్నో సవాళ్లు విసిరింది. ‘సలార్‌’ విజయం తర్వాత తనకు బాలీవుడ్‌ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి' అని చెప్పింది. అలాగే పవన్‌ కల్యాణ్‌ హీరోగా సుజిత్‌ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో నా క్యారెక్టర్ చాలా కీలకమైనదే. నిజంగా ‘ఓజీ’ ఒక అద్భుతమైన మూవీ. డైరెక్టర్ సుజిత్ ఎక్సాట్రార్డినరీ స్టోరీ రాశారని చెప్పింది. అలాగే పవన్‌ కల్యాణ్‌ను కలిసేంతవరకూ ఆయన పెద్ద స్టార్‌ హీరో అనే విషయమే తనకు తెలియదని, ఇంత ఫాలోయింగ్, పాపులారిటీ ఉందని ఎక్స్ పెక్ట్ చేయలేదని చెప్పింది.

ఇది కూడా చదవండి : WFI : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కొత్త టీమ్ సస్పెండ్.. ప్రకటించిన క్రీడా మంత్రిత్వ శాఖ

అలాగే ''ఓజీ'(OG) సినిమాలో అవకాశం దక్కించుకున్నాక.. ఎక్కడికి వెళ్లినా ‘మీరు మా దేవుడితో వర్క్‌ చేస్తున్నారు’ అని చాలామంది ఫ్యాన్స్ నాకు చెప్పారు. నిజంగా పవన్ ను దేవుడితో పోల్చడం నన్ను ఆశ్యర్యానికి గురిచేసింది. ఆయనకున్న విశేష ప్రజాదరణ నన్ను మంత్రముగ్గురాలిని చేసింది. సినిమా సెట్‌లో కలిసినప్పుడు పవన్ నాతో బాగా మాట్లాడారు. ఆయన మనసు చాలా మంచిది. పవర్‌స్టార్‌తో కలిసి వర్క్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఆనందిస్తున్నా. ఇందులో నాది నెగెటివ్‌ రోల్‌ కాదు. కానీ, నా పాత్రలో చాలా షేడ్స్‌ ఉంటాయి. అభిమానులతో కలిసి ఫస్ట్‌డే తొలి షో చూసేందుకు ఎదురుచూస్తున్నా' అంటూ చెప్పుకొచ్చింది శ్రియారెడ్డి. చివరగా ఒక నటిగా తనకు వైవిధ్యభరితమైన పాత్రల్లోనే నటించాలని ఉందన్నారు. ఇక జపాన్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే గ్యాంగ్‌స్టర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న  'ఓజీ' సినిమాలో  పవన్‌కు జోడిగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కూడా నటిస్తుండగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ నిర్మిస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment