IPL 2024 : ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్ మూటగట్టుకున్న ఎస్ఆర్‌హెచ్!

ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నై వేదికగా జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ 113 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా నిలిచింది.

New Update
IPL 2024 : ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్ మూటగట్టుకున్న ఎస్ఆర్‌హెచ్!

SRH : ఐపీఎల్ (IPL 2024) చరిత్రలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ చెత్త రికార్డు (Worst Record) మూటగట్టుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR) తో చెన్నై వేదికగా జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ 113 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా నిలిచింది.

చెత్త రికార్డ్ చెన్నై పేరిట..
ఇప్పటి వరకు ఈ చెత్త రికార్డ్ చెన్నై పేరిట ఉంది. కోల్‌కతా వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ 2013 ఫైనల్లో పూనే 125/9 స్కోర్ చేసి ఓటమిపాలైంది. ఐపీఎల్ 2017 ఫైనల్లో ముంబై ఇండియన్స్ 129/8 చేయగా.. రైజింగ్ పూణే 128/6 పరుగులే చేసి ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. ఇప్పటి వరకు ఇవే అత్యల్ప స్కోర్లుగా ఉండగా ఇప్పుడు ఈ జాబితాలో సన్‌రైజర్స్ చేరింది.

నిప్పులు చెరిగిన కేకేఆర్ బౌలర్స్..
ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు కుప్పకూలింది. కేకేఆర్ స్టార్ పేసర్స్ మిచెల్ స్టార్క్(2/14), హర్షిత్ రాణా(2/14) నిప్పులు చెరగడంతో.. ఎయిడెన్ మార్క్‌రమ్(23 బంతుల్లో 3 ఫోర్లతో 20)‌, ప్యాట్ కమిన్స్(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 24)లు మాత్రమే టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్‌రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ(2), ట్రావిస్ హెడ్(0), రాహుల్ త్రిపాఠి(9), హెన్రీచ్ క్లాసెన్(16) ఎయిడెన్ మార్క్‌రమ్(20), నితీష్ కుమార్ రెడ్డి(13), షెహ్‌బాజ్ అహ్మద్(8), అబ్దుల్ సమద్(4), జయదేవ్ ఉనాద్కత్(4) దారుణంగా విఫలమయ్యారు.

Also Read : నేడే నటి హేమ విచారణ.. అరెస్ట్ చేస్తారా?

Advertisment
Advertisment
తాజా కథనాలు