Sreeleela: అమ్మా శ్రీలీల ఎంత పని చేశావు.. ఏం డెడికేషన్ ఇది! నిర్మాతలకు ఇబ్బంది కలిగించడం ఇష్టం లేక తన ఎంబీబీఎస్ పరీక్షలనే వదులుకుంది ముద్దుగుమ్మ శ్రీలీల. సప్లిమెంటరీలో అయినా పరీక్షలు రాసుకోవచ్చని తాజాగా షూటింగ్ లో పాల్గొంది.గుంటూరు కారం సినిమా కోసం కష్టపడుతుంది శ్రీలీల. By Bhavana 21 Dec 2023 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Most Beauty Heroine Sreeleela : టాలీవుడ్ మోస్ట్ బిజీ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రీలీలనే(Sreeleela) అని చెప్పుకొవచ్చు. నెలకో సినిమా చొప్పున విడుదల చేస్తూ మోస్ట్ బిజీ హీరోయిన్ గా అయిపోయింది. అయితే ఈ క్రమంలో ఆమె కొద్ది రోజులు షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి ముంబయికి(Mumbai) వెళ్లిపోయిందని వార్తలు వచ్చాయి. ఎందుకంటే శ్రీలీల ప్రస్తుతం ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్(MBBS Final Year) చదువుతున్న విషయం తెలిసిందే. ఆమె పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో వారం రోజులు మూవీస్ కి బ్రేక్ ఇచ్చి పరీక్షలు రాయడానికి వెళ్లిందని తెలిసింది. అయితే ఇప్పుడు సినిమాల కోసం పరీక్షలనే మానేసిందంట... స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న శ్రీలీలను ఎంబీబీఎస్ పరీక్షలు సప్లిమెంటరీలో రాసుకోమని గుంటూరు కారం చిత్ర మేకర్స్ కోరారంట. ఎందుకంటే ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికి విడుదల చేయాలని సినిమా బృందం చూస్తుంది. ఈ సమయంలో వారం రోజులు హీరోయిన్ గ్యాప్ ఇచ్చిందంటే చాలా కష్టం అవుతుందని బతిమాలడుకుందంట. దీంతో శ్రీలీల తన పరీక్షలను వాయిదా వేసుకుని షూటింగ్ కి వచ్చేసింది. నిర్మాతలకు ఇబ్బంది కలిగితే తాను తట్టుకోలేనని చెప్పి షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ క్రమంలోనే హీరో హీరోయిన్ల మీద సీన్లు చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవుతుందని చాలా కాలం క్రితమే దర్శక నిర్మాతలు ప్రకటించారు. Also read: మరో ముగ్గురు ఎంపీల సస్పెన్షన్..మొత్తం 146 కి చేరిన సంఖ్య! #tollywood #sreeleela #gunturu-karam #mahesh-babu #mbbs-exams సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి