/rtv/media/media_files/2025/03/20/M7EhQCXGC63qBe9fTBya.jpg)
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు. ముంబై లోని ఫ్యామిలీ కోర్టు గురువారం వీరికి అధికారికంగా విడాకులు మంజూరు చేస్తూ తీర్పు వెలువరించనుంది. చాహల్ దంపతులు ఫిబ్రవరి 5న విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. విడాకుల తర్వాత చాహల్.. ధనశ్రీ వర్మకు రూ.4.75 కోట్లు భరణంగా ఇస్తాడు. ఇందులో ఇప్పటికే చాహల్ రూ. 2.37 కోట్లు చెల్లించినట్లుగా సమాచారం. ఈ విడాకుల తీర్పుకోసం చాహాల్ ఇంకా ఐపీఎల్ టీమ్ తో చేరలేదు. అయితే ఇంతకీ చాహల్ ఆస్తులెంత అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
చాహల్ మొత్తం ఆస్తులు దాదాపు రూ.45 కోట్లు. అతనికి ప్రధాన ఆదాయం క్రికెట్ నుంచే వస్తుంది. బీసీసీఐ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో ఒప్పందాలు, ప్రకటనల నుండి చాహల్ కు ఆదాయంగా వస్తుంది. చాహల్ బీసీసీఐతో గ్రేడ్ సి కాంట్రాక్ట్ ఉంది. ఈ కాంట్రాక్టుకు గానూ ఏడాదికి కోటి రూపాయలు వస్తాయి. చాహల్ కు ఐపీఎల్‌లో చాలా డిమాండ్ ఉంది. 2025లో పంజాబ్ కింగ్స్ అతన్ని రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటివరకు చాహల్ ఐపీఎల్ ద్వారా దాదాపు రూ.37 కోట్లు సంపాదించాడు.
చాహల్ క్రికెట్ ద్వారానే కాకుండా ప్రకటనల ద్వారా కూడా చాలా సంపాదిస్తాడు. అతను వివో, నైక్, అక్యూవ్, బూమ్ 11, ఫాంటా వంటి పెద్ద బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉన్నాడు. ఇది కాకుండా అతనికి హర్యానాలోని గురుగ్రామ్‌లో ఒక విలాసవంతమైన ఇల్లు ఉంది. అతనికి ఖరీదైన కార్లంటే చాలా ఇష్టం. అతని లగ్జరీ కార్ల జాబితాలో పోర్స్చే కయెన్ ఎస్ , మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్ ఉన్నాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసుకోవడంతో
కాగా ధనశ్రీ, యుజ్వేంద్ర ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో వీరి విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 2020 డిసెంబర్ 22న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. గత నెలలో చాహల్ న్యాయవాది నితిన్ కె గుప్తా మాట్లాడుతూ వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లుగా ధృవీకరించారు.