/rtv/media/media_files/2025/02/15/SXDQnVchIUJMqpQ74Esc.jpg)
yuzvendra chahal shares emotional post
టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ - ధనశ్రీ వర్మ జంట విడిపోతున్నారనే వార్తలు గత కొద్ది రోజులుగా నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. త్వరలో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ జోరుగా వార్తలు సాగుతున్నాయి. దానికి ఓ బలమైన కారణం కూడా ఉంది. ఈ జంట తమ ఇన్ స్టా ఖాతాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం ఒకెత్తయితే.. చాహల్ తన అకౌంట్ లో తన భార్యకు సంబంధించిన ఫొటోలను డిలీట్ చేయడం మరో ఎత్తనే చెప్పాలి. దీంతో వీరి విడాకుల వార్తలకు బలం చేకూరినట్లయింది.
Also Read: ఆ విషయంలో భర్త బలవంతం చేసినా తప్పుకాదు: హైకోర్టు
చాహల్ వాలెంటైన్స్ డే పోస్టు
ఇక వీరి విడాకుల వార్తల నేపథ్యంలో వాలెంటైన్స్ డే సందర్భంగా చాహల్ పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు.. నీ జీవితాన్ని మార్చేందుకు ఇతరులను అనుమతించకు అంటూ చాహల్ తన ఇన్ స్టాలో పోస్టు పెట్టాడు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారింది.
Also Read : USA: ఎలాన్ మస్క్ నా బిడ్డకు తండ్రి..రచయిత్రి, ఇన్ఫ్లూయెన్సర్
వార్తలు నిజం కావచ్చు
అయితే ఏ ఉద్దేశంతో అతడు ఈ పోస్టు పెట్టాడో పూర్తి స్పష్టత లేకపోయినా.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించే ఈ పోస్టు పెట్టి ఉంటాడని నెటిజన్లు భావిస్తున్నారు. ఇక వీరి విడాకుల వార్తలు జోరందుకోవడంపై చాహల్ తాజాగా మరో పోస్టు పెట్టాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కావచ్చు.. కాకపోవచ్చని ఆ పోస్టులో రాసుకొచ్చాడు. ఈ పోస్టు తమ అభిమానుల అనుమానాలకు మరింత బలం చేకూరింది.
Also Read : USA: ట్రంప్, మస్క్ కలిసి ఉద్యోగాలు పీకేస్తున్నారు..ఇప్పటికి 10వేల మంది అవుట్
2020లో లవ్ మ్యారేజ్
చాహల్ ప్రొఫెషనల్ లైఫ్ ఎంతగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిందో.. అతడి పర్సనల్ లైఫ్ కూడా దానికంటే మరింత చర్చనీయాంశమైంది. చాహల్ 2020లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రముఖ నటి, మోడల్, డ్యాన్సర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స్‌ర్ ధనశ్రీని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అనంతరం ఈ జంట రెండేళ్లు ఎంతో అన్యోన్యంగా జీవించింది.
కానీ ఊహించని కొన్ని మార్పులతో వారి జీవితానికి శుభం కార్డు పడనున్నట్లు తెలుస్తోంది. ఈ లవ్ కపుల్ విడాకులు తీసుకోబోతున్నారన్న ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా గతంలో ధనశ్రీ పై ఎలాంటి నెగెటివ్ కామెంట్స్ వచ్చినా.. చాహల్ స్పందించే వాడు. కానీ ఇప్పుడు కనీసం రియాక్ట్ కావడం లేదు.
Also Read : మరో బ్యూటీతో లలిత్ మోదీ రాసలీలలు.. లవర్స్ డే స్పెషల్ పోస్ట్.. ఆ అందగత్తే ఎవరో తెలుసా!
ఒకరినొకరు అన్‌ఫాలో
తాజాగా వీరి విడాకులకు సంబంధించిన మరిన్ని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నట్లు తెలిసింది. అదే సమయంలో అన్‌ఫాలో అనంతరం చాహల్ తన అకౌంట్‌లో ధనశ్రీతో ఉన్న అన్ని ఫొటోలను తొలగించాడు. దీంతో ఈ జంట విడాకులు నిజమేనని నెటిజన్లు ఒక అంచనాకు వచ్చేశారు.
2023లో మొదలు
కాగా వీరి విడాకులకు సంబంధించి వార్తలు రావడం ఇది తొలిసారి కాదు. గతంలో 2023లో ధనశ్రీ తన భర్త చాహల్‌ను అన్‌ఫాలో చేసినప్పుడు కూడా ఇలానే వార్తలు వైరల్ అయ్యాయి. చాహల్ - ధనశ్రీ జంట విడాకులకు సంబంధించి రూమర్స్ రావడం అదే తొలిసారి. ఇక ఇప్పుడు మళ్లీ వీరి విడాకుల వార్తలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ విడిపోవడానికి ఈ జంట సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఈ జంట నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.