Yuvraj Singh: 2007ను గుర్తుకుతెచ్చిన యువరాజ్.. 7 సిక్సర్లతో స్టేడియం షేక్!

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో యువరాజ్ చెలరేగిపోయాడు. మొత్తం 7సిక్సర్లతో రచ్చరచ్చ చేశాడు. దీంతో 2007 తొలి టి20 ప్రపంచ కప్‌ మ్యాచ్‌ను గుర్తు చేశాడు.

New Update
Yuvraj Singh smashes 7 sixes as India Masters

Yuvraj Singh smashes 7 sixes as India Masters

Yuvraj Singh IML Videos

ప్రస్తుతం ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20 జరుగుతోంది. ఇది కేవలం రిటైరైన క్రికెటర్ల కోసం మాత్రమే నిర్వహించారు. ఈ టోర్నీలో భారత్ దూసుకుపోతోంది. సచిన్ టెడ్కూలర్ సారథ్యంలో వరుస విజయాలతో పరుగులు పెడుతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. 

Also Read :  పరువు పోయిందిగా.. పాకిస్థాన్ క్రికెటర్లకు ఘోర అవమానం!

ఈ మ్యాచ్ గెలుపులో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. గ్రౌండ్‌లో పరుగుల వరద పెట్టించాడు. యువరాజ్ బాదిన అద్భుతమైన సిక్సర్లు అభిమానులకు అతని పాత విజయాలను గుర్తుకు తెచ్చాయి. ఈ మ్యాచ్‌లో అతడు 7 సిక్సర్లతో దుమ్ము దులిపేశాడు. దీంతో సెప్టెంబర్ 19, 2007 తొలి టి20 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ వరుసగా ఆరు సిక్సర్లు బాదిన క్షణాలను ఫ్యాన్స్ గుర్తుకు తెచ్చుకున్నారు. 

ఈ IMLలో యువరాజ్ 30 బంతుల్లో 59 పరుగులు చేశాడు. అందులో 7 సిక్సర్లు, ఒక ఫోర్ ఉంది. ముఖ్యంగా అతడు ఆస్ట్రేలియా లెగ్-స్పిన్నర్ మెక్‌గెయిన్‌ వేసిన ఒకే ఓవర్‌లో మూడు సిక్సర్లు బాదాడు. దీంతో అతిపెద్ద హిట్టర్లలో ఒకడిగా తన హోదాను మరోసారి నిరూపించుకున్నాడు. 

ఈ మ్యాచ్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా తన ప్రతిభను ప్రదర్శించాడు. 30 బంతుల్లో 7 ఫోర్లతో 42 పరుగులు చేశాడు. అలాగే ఆల్ రౌండర్ స్టూవర్ట్ బిన్నీ 21 బంతుల్లో 36 పరుగులు చేశాడు. యూసుఫ్ పఠాన్ 10 బంతుల్లో 23 పరుగులు చేశాడు. ఇర్ఫాన్ పఠాన్ కూడా 7 బంతుల్లో 19 పరుగులు చేసి అద్భుతంగా రాణించారు.

Also read : ఇది కదా హారర్ అంటే.. పట్టపగలే వణుకు పుట్టించే థ్రిల్లర్..

ఇలా భారత్ 7 వికెట్ల నష్టానికి 220 పరగులు సాధించింది. దీంతో ఈ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా ఆదిలోనే అంతమైంది. పవర్‌ప్లే లోపల ఆస్ట్రేలియా మాస్టర్స్ మూడు వికెట్లు కోల్పోయింది. ఇక పవర్‌ప్లే తర్వాత ఆస్ట్రేలియా 49/3తో ఇబ్బంది పడింది. మొత్తంగా భారత మాస్టర్స్ బౌలర్లు ఆస్ట్రేలియా మాస్టర్స్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DC vs RR : అదరగొట్టిన ఢిల్లీ .. రాజస్థాన్ టార్గెట్ 189

ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది, ఓపెనర్ అభిషేక్ పొరెల్ (49)టాప్ స్కోరర్ గా నిలిచాడు. కేఎల్ రాహుల్ (38) పరుగులతొ రాణించారు.

New Update
dc-vs-rr match

dc-vs-rr match

ఐపీఎల్ 2025లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఓపెనర్లు జేక్ ఫ్రేజర్  (9), అభిషేక్ పొరెల్(49)  మంచి శుభారంభాన్ని అందించారు. అభిషేక్ పొరెల్ దూకుడుగా జట్టు స్కోరు బోర్డును పెంచాడు. తుషార్ దేశ్‌పాండే వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో 23 పరుగులు రాబట్టాడు. వరుసగా 4, 4, 6, 4, 4 బాదేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.  

 ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్‌

34 పరుగుల వద్ద  ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్‌ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ వేసిన 2.3 ఓవర్‌కు జేక్ ఫ్రేజర్ ఔట్  అయ్యాడు. ఆ తరువాత వచ్చిన కరుణ్‌ నాయర్ ఈ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన  కేఎల్ రాహుల్(38) తో కలిసి జట్టును ముందుకు నడిపించాడు పొరెల్. అయితే 97 పరుగుల వద్ద  కేఎల్ రాహుల్ రూపంలో ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. ఆ  కాసేపటికే అభిషేక్ పొరెల్ కూడా ఔటయ్యాడు. దీంతో 106 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 

అనంతరం స్టబ్స్ (34), అక్షర్ (34) ఇద్దరు దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పెంచారు.  హసరంగ వేసిన 16 ఓవర్లో అక్షర్ పటేల్ తొలి మూడు బంతులకు వరుసగా 4, 4, 6 బాదేశాడు. ఈ ఓవర్‌లో 19 పరుగులు వచ్చాయి. ఇద్దరు 19 బంతుల్లో 41 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించగా వీరి జోడీని తీక్షణ విడదీశాడు. చివర్లో స్టబ్స్, అశుతోష్ శర్మ(11) దూకుడుగా ఆడటంతో ఢిల్లీ జట్టు 188 పరుగులు చేసింది. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2, మహీశ్‌ తీక్షణ, వానిందు హసరంగ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Advertisment
Advertisment
Advertisment