Virat Kohli: అరె అచ్చం విరాట్ లాగే ఉన్నాడే.. ఎవరీ తుర్కియే కోహ్లీ!

మనిషిని పోలిన మనుషులు ఉంటారని వింటుంటాం. స్టార్ క్రికెటర్ కోహ్లీని పోలిన ఓ వ్యక్తి తుర్కియేలో దర్శనమిచ్చారు. టీవీ యాక్టర్ సెటిన్ గునర్ అచ్చం కింగ్‌ను పోలి ఉన్నారు. ఆయన ఫొటోలు వైరల్ కావడంతో అచ్చం కోహ్లీలా ఉన్నారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

New Update
kohli-dupe

kohli-dupe

మనిషిని పోలిన మనుషులు ఉంటారని మనం వింటుంటాం కదా.  అప్పుడప్పుడు సెలబ్రెటీలను పోలి ఉన్న వ్యక్తులు మన కంటపడుతుంటారు.  తాజాగా టీమిండియా స్టార్ క్రికెటర్ కోహ్లీని పోలిన ఓ వ్యక్తి తుర్కియేలో కనిపించాడు. టీవీ యాక్టర్ సెటిన్ గునర్ అచ్చం కింగ్‌ను పోలి ఉన్నారు. ఆయన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. దీంతో అచ్చం కోహ్లీలాగే  ఉన్నారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా గతంలో కాన్పూర్‌ వేదికగా భారత్‌-బంగ్లాదేశ్ టెస్ట్‌ మ్యాచ్‌ సందర్భంగా అచ్చం కోహ్లీని పోలి ఉండే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ కార్తీక్‌ శర్మ, విరాట్‌తో సెల్ఫీ తీసుకున్నాడు. అలాగే ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగినప్పుడు అచ్చం కోహ్లీని పోలిన మరో వ్యక్తి కనిపించాడు.

Also Read :  తాహనజర్ హత్యకు అదే కారణమా? పోలీసుల విచారణలో సంచలనాలు!

అచ్చం విరాట్ కోహ్లీ లాగే

తుర్కియే నటుడు కావిట్ సెటిన్ గునెర్ అచ్చం విరాట్ కోహ్లీ లాగే ఉంటాడు. తుర్కియే సిరీస్‌ అయిన దిరిలిస్: ఎర్టుగ్రుల్‌లో కావిట్‌ సెటిన్ నటించాడు.  ఇందులోని ఓ సన్నివేశానికి సంబంధించిన స్రీన్ షాట్ లో ఆయన మీసం కట్టు, గడ్డం కళ్లు.. ఇలా ఎలా చూసిన కోహ్లీ లాగే కనిపిస్తున్నాడు.  ఇది చూసిన అభిమానులు కొందరు అనుష్క శర్మ భర్త టీవీ షో అరంగేట్రం చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ హల్ చల్ చేస్తున్నారు.  కోహ్లీ టీవీ సిరీస్‌ల్లో నటిస్తున్నాడా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే అతడు కోహ్లీ కాదని.. తుర్కియే కోహ్లీ అని ఓనెటిజన్ కామెంట్ చేశాడు.  

Also Read :  మా జోలికొస్తే వినాశనమే.. తప్పించుకోలేవ్: పుతిన్‌కు నాటో వార్నింగ్!

కోహ్లీ ఎప్పుడూ సినిమాల్లో నటించకపోయినా, అనేక ప్రకటనలలో కనిపించాడు. ఇటీవల, ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవంలో షారుఖ్ ఖాన్‌తో కలిసి సందండి చేశాడు.  ఇక పెళ్లాయ్యాక  సినిమాల నుండి విరామం తీసుకున్న అనుష్క శర్మ, చివరిగా షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్‌తో కలిసి నటించిన జీరోలో కనిపించింది. ఆమె రాబోయే నెట్‌ఫ్లిక్స్ బయోపిక్ చక్దా 'ఎక్స్‌ప్రెస్ షూటింగ్ ను కంప్లీ్ట్ చేసింది కానీ ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. 

Also Read :  GT vs PBKS : గుజరాత్ను ఓడించి..పంజాబ్ను గెలిపించిన రూ. 5 కోట్ల ఆటగాడు!

Also Read :  లారీలో రహస్యంగా పేకాట.. పోలీసులకు పట్టించిన డ్రోన్.. సినిమాటిక్ వీడియో వైరల్!

 

Turkish kohli | virat-kohli | telugu-sports-news | telugu-cricket-news | latest-telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు