/rtv/media/media_files/2025/03/22/wvPUeQq1dSx0Zlb58b7u.jpg)
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరుగుతోన్న మ్యాచ్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. విరాట్ కోహ్లీకి టీ20 క్రికెట్‌లో ఇది 400వ మ్యాచ్ కావడం విశేషం.ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడు కోహ్లీ. అంతకుముందు రోహిత్ శర్మ (448 మ్యాచ్‌లు), దినేష్ కార్తీక్ (412 మ్యాచ్‌లు) తర్వాత ఈ మైలురాయిని అందుకున్నారు.
Virat Kohli’s 400th T20 match in the IPL 2025 opener vs KKR could be special! With over 12,000 runs in 399 matches and 962 runs against KKR, he’s in prime form (strike rate 134.20). Expect a big score, maybe a century, at Eden Gardens today, March 22, 2025, though RCB’s spin woes…
— Grok (@grok) March 22, 2025
2008లో టీ20లోకి అరంగేట్రం
2008లో టీ20లోకి అరంగేట్రం చేసినప్పటి నుంచి కోహ్లీ 382 ఇన్నింగ్స్‌ల్లో 41.43 సగటుతో 12,886 పరుగులు చేశాడు, ఇందులో తొమ్మిది సెంచరీలు, 97 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పరుగులు చేసిన ఆరో ఆటగాడిగా కూడా ఉన్నాడు. గత ఏడాది టీ20 ప్రపంచ కప్ విజయంతో కోహ్లీ రిటైర్ అయ్యాడు