/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Virat-Kohli-2-jpg.webp)
Virat Kohli big anouncement on his retirement
Virat: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన భవిష్యత్తు కార్యచరణకు సంబంధించి కీలక ప్రకటన చేశాడు. 2027 ODI వరల్డ్ కప్ టోర్నీలో ఆడటంపై బిగ్ అప్ డేట్ ఇచ్చాడు. ఈ మేరకు ప్రస్తుతం ఐపీఎల్ టోర్నీలో బిజీగా ఉన్న కోహ్లీ.. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా 'మీ నెక్ట్స్ బిగ్ స్టెప్ ఏమిటి?' అని ప్రశ్నించిన హోస్ట్ ప్రశ్నించగా 'మా తదుపరి పెద్ద ప్రాజెక్ట్ 2027 వరల్డ్ కప్' అని చెప్పాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆనందంతో కేకలు వేస్తూ చప్పట్లు కొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. విరాట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
VIRAT KOHLI AT THE 2027 WORLD CUP.
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 1, 2025
- Kohli confirms World Cup as his next big step. 🐐🇮🇳pic.twitter.com/SJExtQIHtk
17 ఏళ్ల రికార్డ్ బ్రేక్..
ఇదిలా ఉంటే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఈ ఐపీఎల్ సీజన్ లో అదరగొడుతోంది. ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఘన విజయం సాధించింది.17 ఏళ్ళ క్రితం మిస్టర్ వాల్ కెప్టెన్సీలో ఆర్సీబీ జట్టు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మ్యాచ్ గెలిచింది. ఆ తర్వాత ఆర్సీబీ మాత్రం ఒక్క మ్యాచ్ కూడా గెలువలేదు. ఎట్టకేలకు ఈ సీజన్ లో రజత్ పాటీదార్ కెప్టెన్సీలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బ్రేక్ చేసింది. చెన్నైలో చెన్నైని ఓడించి సూపర్ విక్టరీని తన ఖాతాలో వేసుకుంది.
Execute a 𝗽𝗲𝗿𝗳𝗲𝗰𝘁 straight drive ✅ 🤌
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 1, 2025
Strike a 𝗽𝗲𝗿𝗳𝗲𝗰𝘁 pose for the camera ✅📸#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 pic.twitter.com/HKy50wbYIf
ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!
ఇక ఇటీవల భారత్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఈ టోర్నీ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డేలకు గుడ్ బై చెబుతారని భావించారు. కానీ అలా జరగలేదు. ఇంకా క్రికెట్ ఆడుతామంటున్నారు. ప్రస్తుతం వన్డే, టెస్టు ఫార్మాట్లో కొనసాగుతున్న వీరిద్దరూ.. 2027 వరల్డ్ కప్ సాధించి రిటైర్ కావాలనుకుంటున్నారు.
ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
virat-kohli | world-cup | telugu-news | today telugu news