/rtv/media/media_files/2025/04/09/B7eqfvBVHgnSPp6X0hkT.jpg)
dhoni thaman
పంజాబ్, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ధోనీ ఆటపై మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘ఆయనపై మొరుగుతున్న కుక్కలన్నీ ఆ దిగ్గజం ఆటను చూశాయని భావిస్తున్నా’ అని ఒక పోస్ట్ పెట్టారు. దాని కింద విమర్శలు వస్తుండటంతో సమాధానంగా మరో ట్వీట్ చేశారు. ‘ఇది సీఎస్కే గెలుపు గురించి కాదు. దేశానికి ఎన్నో సిరీస్‌లు గెలిపించిన మనిషి గురించి. మనతో ఆ ట్రోఫీలు ఉన్నాయంటే ఆ ఒక్కడి వల్లే’ అని పోస్టులో తమన్ వెల్లడించాడు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ధోనీ 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్సులు, ఓ ఫోర్ ఉంది.
Hope all the barking Dogs 🐕 are watching the legend play 🔥
— thaman S (@MusicThaman) April 8, 2025
It’s Not CSK winning !!
— thaman S (@MusicThaman) April 8, 2025
This Man Who Won So many Series For His Country !!
U name the trophy’s it’s With Us Because of this One Man the Legend @msdhoni 🔥💥❤️
ఉర్రూతలూగించిన ధోనీ
అయితే ఈ మ్యాచ్ లో చెన్నై ఓడిపోగా 18 రన్స్ తేడాతో పంజాబ్ విజయం సాధించింది. 220 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో చెన్నై 201-5 స్కోరుకు పరిమితమైంది. ధోనీ(27) చివరి వరకూ పోరాడినా ఆ జట్టుకు మరో ఓటమి తప్పలేదు. అయితే ఉన్నంత సేపు తన అభిమానుల్ని ఉర్రూతలూగించారు. ధోనీ ఔటైనప్పుడు ఓ అభిమాని భోరున విలపించింది. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. చెన్నై ఆటగాళ్లలో కాన్వే (69), దూబే (42), రచిన్ (36) రన్స్ చేశారు. అంతకుముందు పంజాబ్ కింగ్స్ ప్లేయర్ ప్రియాంశ్ ఆర్య (103) సెంచరీతో అదరగొట్టారు. కాగా ఈ సీజన్‌లో పంజాబ్ కు ఇది మూడో విజయం. చెన్నైకు నాలుగో ఓటమి.
Also Read : Tamilisai Soundararajan : తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!