/rtv/media/media_files/2025/03/04/q9oLWm3uCVC3nO1SIqWF.jpg)
టీమ్ ఇండియా
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా తొలి సెమీ ఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. తరువాత బ్యాటింగ్ కు దిగిన లక్ష్య ఛేదనలో దూకుడు ప్రదర్శించింది. కింగ్ కోహ్లీ మ్యాచ్ ను మొత్తం నడిపించాడు. ఓపెనర్లుగా దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ 28 పరుగులకు , గిల్ 8 పరుగులకు అవుట్ అయ్యారు. తరువాత వచ్చిన విరాట్, శ్రేయస్ అయ్యర్ లు నిలకడగా ఆడారు. అయ్యర్ 45 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కానీ కోహ్లీ మాత్రం తనదైన ఆటను కొనసాగిస్తూ..98 బంతుల్లో 84 పరుగులు చేశాడు. ఆసీస్ లక్ష్యాన్ని టీమ్ ఇండియా కు చేరువ చేశాడు. తరువాత కె ఎల్ రాహుల్ మళ్ళీ నిలకడగా ఆడి మ్యాచ్ ను గెలిపించాడు. మధ్యలో వచ్చిన హార్దిక్ పాండ్యా మూడు మ్యాచ్ ను పరుగెత్తాంచాడు. పాండ్యా ఇచ్చిన ఎనర్జీతో రాహుల్ మ్యాచ్ ను ముగించాడు. ఇంకా 11 బంతులు మిగిలుండగానే మ్యాచ్ ను గెలిచి ఫైనల్స్ కు దూసుకెళ్లింది.
𝙄𝙉𝙏𝙊 𝙏𝙃𝙀 𝙁𝙄𝙉𝘼𝙇𝙎 🥳
— BCCI (@BCCI) March 4, 2025
Scorecard ▶️ https://t.co/HYAJl7biEo#TeamIndia | #INDvAUS | #ChampionsTrophy pic.twitter.com/k67s4fLKf3
వరల్డ్ కప్ పగ..ఒకటికి రెండు
లాస్వట్న్డ్ ఇయర్ జరిగిన వన్డే వరల్డ్ కప్ ను ఎవరూ మర్చిపోలేరు. మొదటి నుంచి చివర వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్స్ చేరుకుంది టీమ్ ఇండియా. అద్భుతంగా ఆడుతున్న భారత జట్టును ఒకే ఒక్క మ్యాచ్ తో మట్టికరిపించింది ఆస్ట్రేలియా. ఈ సారి కప్ మనదే అనుకుంటున్న తరుణంలో టీమ్ ఇండియాను ఓడించి వరల్డ్ కప్ ను ఎగురేసుకుని పోయింది ఆసీస్ జట్టు. అది కాకుండా ఆ తరువాత కప్ మీద కాళ్ళు పెట్టి, టీమ్ ఇండియాను చులకన చేస్తూ ఆస్ట్రేలియా విపరీత చర్యలు చేసింది. అప్పటి నుంచి మన వాళ్ళు కసితో రగిలిపోతున్నారు. వాళ్ళ మీద గెలిచి ఎలా అయినా పగ తీర్చుకోవాలని చూశారు. తరువాత ఆసీస్ తో జరిగిన టెస్ట్, వన్డే సీరీస్ లలోనే టీమ్ ఇండియా పరాజయాలను మూటగట్టకుంది. అప్పట్టి నుంచి ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా...వాళ్ళను కొట్టి పగ తీర్చుకుందామా అని చూసింది. ఇన్నాళ్ళకు టీమ్ ఇండియాకు ఆ ఛాన్స్ వచ్చింది. ఛాంపియన్స్ ట్రోపీలో...నిజమైన ఛాంపియన్స్ గా ఆడుతున్న టీమ్ ఇండియా సెమీ ఫైనల్స్ లో ఆసీస్ జట్టును చితక్కొట్టింది. ఫైనల్స్ లో భారత్ ను కొట్టి కప్ ను గెలుచుకున్న ఆసీస్ ను సెమీస్ లోనే ఇంటికి పంపించి ఆ పగను ఇప్పుడు తీర్చుకుంది. ఆస్ట్రేలియాను సెమీ ఫైనల్స్ లోనే ఇంటికి పంపించి ఛాంపియన్స్ గా నిలిచింది. దీంతో ఇది కదా రివేంజ్ అని భారత అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
భారత జట్టు ఈ మ్యాచ్ లో సమిష్టిగా ఆడింది. బ్యాటర్లు అందరూ నిలకడగా ఆడడమే కాక మంచి స్కోర్లతో మ్యాచ్ గెలవడానికి కారణమయ్యారు. ముఖ్యంగా కింగ్ కోహ్లీ రెండోసారి సెంచరీకి చేరువవడమే కాకుండా బాధ్యతాయుతంగా ఆడడం అందరి దృష్టినీ ఆకర్షించింది. అలాగే రెండేళ్లుగా ఇండియాకు కొరకరాని కొయ్యగా మారిన ట్రావిస్ హెడ్ ను ఈ మ్యాచ్ లో మన బౌలర్లు త్వరగానే ఔట్ చేశారు. మొదట్లోనే రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అతడు.. 35 బంతుల్లో 39 రన్స్ చేసి ఔటయ్యాడు. వరుణ్ చక్రవర్తి అతన్ని ఔట్ చేశాడు.