/rtv/media/media_files/2025/03/23/v6n1pKQDVuZcfeAFZSDP.jpg)
ఐపీఎల్ లో రెండో మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఉప్పల్ స్డేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతోన్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్రైజర్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఆదివారం సెలవుదినం కావడంతో మ్యాచ్ చూసేందుకు భారీగా అభిమానులు చేరుకున్నారు. అభిమానుల కేరింతలతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కు పాట్ కమ్మిన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రియాన్ పరాగ్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.
రాజస్థాన్ Vs హైదరాబాద్ మధ్య మ్యాచ్ లు
మొత్తం మ్యాచ్‌లు: 20
హైదరాబాద్ విజయం: 11
రాజస్థాన్ విజయం: 9
That Roar 🔥
— Power Ranger 💙🌶️ (@BluePoweRangerr) March 23, 2025
caPATain CUMMINS 🧡 #SRHvRR #IPL2025 pic.twitter.com/maquRxhqaM
జట్లు ఇవే
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు : అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, ఆడమ్ జంపా, మహ్మద్ షమీ.
రాజస్థాన్ రాయల్స్ జట్టు : యశస్వి జైస్వాల్, సంజు సామ్సన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మైర్, ధ్రువ్ జురెల్, శుభం దుబే, వానిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ.