/rtv/media/media_files/2025/03/27/YiWjuW7ZiLI4CNt0hf5w.jpg)
SRH VS LSG
ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టంతో 190 పరుగులు చేసింది. నితిష్ కుమార్ 32, ట్రావిస్ హెడ్ 47, అంకిత్ వర్మ 36, క్లాసెన్ 26 పరుగులు చేసి స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లారు. అభిషేక్ శర్మ (6), ఇషాన్ కిషన్ (0), అభినవ్ మనోహర్ (0) నిరాశపర్చారు. లక్నో టీమ్ నుంచి షార్దుల్ ఠాకుర్ నాలుగు వికెట్లు తీశాడు. అవేశ్ ఖాన్, దిగ్వేశ్ రాఠీ, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్ తలో వికెట్ తీశారు.
Also Read: పోలీసులు కాదు రాక్షసులు.. పసివాడిపై థర్డ్ డిగ్రీ.. ప్రాణం పోయేలా కొట్టి!
ఇన్నింగ్స్ ప్రారంభంలోనే SRHకు షాకులు తగిలాయి. మొదటి రెండు ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే వచ్చాయి. మూడో ఓవర్ వేసిన శార్దూల్ ఠాకూర్ వరుసగా రెండు వికెట్లు పడగొట్టాడు. అభిషేక్ శర్మ క్యాచ్ఔట్ అయ్యాడు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ ఈసారి మాత్రం మొదటి బాల్‌కే డకౌట్ అయ్యాడు. ఇక ట్రావిస్ హెడ్ స్కోర్‌ను పరిగెత్తించాడు. 47 పరుగులు చేశాక ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో హెడ్ ఔటయ్యాడు.
Also Read: వినియోగదారులకు షాక్.. పెరిగిన పాల ధరలు.. ఎంతంటే ?
ఇక బిష్ణోయ్ బౌలింగ్‌లో అంపైర్ కాల్‌తో LBW నుంచి నితీశ్ తప్పించుకోగా కాసేపటికే బౌలర్స్ ఎండ్‌లో క్లాసెన్ రనౌట్ అయిపోయాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన అనికేత్ మొదటి నుంచే సిక్సర్లు బాదాడు. నితీశ్ ఔటైనా కూడా అనికేత్ స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత దిగ్వేశ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో కమిన్స్ ఔటయ్యాడు.
Onto our bowlers now 🫡#PlayWithFire | #SRHvLSG | #TATAIPL2025 pic.twitter.com/UOA8HPqMzt
— SunRisers Hyderabad (@SunRisers) March 27, 2025
srh | lucknow-super-giants | ipl-2025