/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/shami-jpg.webp)
Mohammed Shami
ఆస్ట్రేలియా, ఇండియా మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే మంచి రసవత్తరంగా జరగాల్సిందే. కొన్నేళ్ళ నుంచి ఇరు జట్ల మధ్యనా మ్యాచ్ లు నువ్వా నేనా అన్నట్టు సాగుతున్నాయి. అయితే ఎక్కువసార్లు విజయం ఆసీస్ సొంతమౌతోంది. గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ లో మన చేతిలో నుంచి ట్రోఫీని లాక్కెళ్ళిపోయింది కంగారూల జట్టు. తరువాత జరిగిన మ్యాచ్ లు కూడా ఇందుకు తగ్గట్టుగానే జరిగాయి. దాంతో ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైన్లస్ మ్యాచ్ కోసం కూడా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో గెలిచిన వారు ఫైనల్స్ కు చేరుకుంటారు.
స్పిన్నర్ల మీద ప్రెషర్...
ఛాంపియన్స్ ట్రోపీలో ఆస్ట్రేలియా, ఇండియా రెండూ బలమైన జట్లుగా ఉన్నాయి. అందులోనూ ఆసీస్ బ్యాటర్లు వీరంగం సృష్టిస్తున్నారు. ట్రావిడ్ హెడ్ అయితే క్రీజులో రచ్చ రచ్చ చేస్తున్నాడు. అందరికంటే ఇతడిని నిలువరించడం భారత బౌలర్ల తక్షణ కర్తవ్యం. దుబాయ్ పిచ్ లు మొదటి నుంచి స్పిన్నర్లుకు బాగా అనుకూలిస్తున్నాయి. దాంతో ఇప్పుడు భారం అంతా వారిపైనే పడింది. ఈ క్రమంలో భారత ముఖ్య స్పిన్నర్ అయిన షమి మీద హైప్రెషర్ ఉంది. అందుకే టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ షమికి సలహాలు ఇచ్చాడు. ట్రావిస్ హెడ్ అంటే ఉన్న భయాన్ని ముందు మైండ్ లో నుంచి తీసేయాలని సూచించాడు. సాధ్యమైనంత తొందరగా అతణ్ణి అవుట్ చేయాలని...ఆ తర్వాత మ్యాక్స్ వెల్, జోష్ ఇంగ్లిస్ లాంటి హిట్టర్లకు కూడా ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పకడ్బందీగా బౌలింగ్ చేయాలని హెచ్చరించాడు భజ్జీ. టీమ్ ఇండియా ఇప్పటి వరకు ెలా అయితే స్ట్రాంగ్ గా ఆడుతూ వస్తోందో...అలాగే ఆడాలని సూచించాడు. ఇద ి నాకౌట్ మ్యాచ్ అని..అతిగా ఏమీ ప్రయత్నించాల్సిన అవసరం లేదని చెప్పాడు.
Also Read: IND vs AUS : ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్ .. రివేంజ్కు టీమిండియా ప్లాన్!