/rtv/media/media_files/2025/03/31/UwVV4rT38GcK93rh58jn.jpg)
parag fine
Riyan Parag: గువాహటి వేదికగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్(CSK)ను ఓడించి రాజస్థాన్ రాయల్స్(RR) ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ విక్టరీతో ఫుల్ ఖుషిలో ఉన్న ఆ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఐపీఎల్ పాలకమండలి(IPL Code Of Conduct ) అతనికి భారీ జరిమానా విధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ 11వ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటును కొనసాగించినందుకు గానూ అతనికి రూ. 12 లక్షల జరిమానా విధించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఇది అతని మొదటి నేరం కాబట్టి అతనికి రూ.12 లక్షల జరిమానాతో సరిపెట్టింది. మరోసారి ఇలాగే జరిగితే ఒక ఆటపై నిషేదాన్ని విధిస్తారు.
Also Read : Betting App: బెట్టింగ్ యాప్స్‌పై సిట్ ఏర్పాటు.. డీజీపీ కీలక ఆదేశం
Riyan Parag has been fined 12 Lakhs for the Slow Over-rate against Chennai Super Kings 🏆 pic.twitter.com/g7qG2mYuG7
— Cric My Life (@cricmylife_) March 31, 2025
Also Read : UP Crime: అలహాబాద్ ఐఐఐటీలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య!
20-ఓవర్ల కోటాను నిర్ణీత సమయంలోపు
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం, ఒక జట్టు తమ 20-ఓవర్ల కోటాను నిర్ణీత సమయంలోపు పూర్తి చేయాలి, కానీ పరాగ్ అలా చేయడంలో విఫలమవడంతో జరిమానా విధించారు. పరాగ్ నాయకత్వంలోని రాజస్థాన్ జట్టు.. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సూపర్ కింగ్స్ జట్టు తడబడింది. దీంతో పరాగ్ రాజస్థాన్ కెప్టెన్‌గా తన తొలి విజయాన్ని నమోదు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది వరుసగా రెండో ఓటమి.
కాగా పరాగ్ కంటే ముందు, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్లో-ఓవర్ రేటు ఉల్లంఘనకు గానూ రూ.12 లక్షల జరిమానా విధించబడ్డాడు. హార్దిక్ గత సీజన్‌లో మూడు మ్యాచ్ లలో స్లో-ఓవర్ రేటు ఉల్లంఘనకు పాల్పడటంతో చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్ లో అతనిపై నిషేదం విధించారు.
Also Read : DC vs SRH : ఉగాది రోజున ఊచకోత.. సన్‌రైజర్స్కు రెండో ఓటమి!