రిటైర్మెంట్ పై రోహిత్, కోహ్లీ క్లారిటీ.. ఫ్యాన్స్ కు పండగే!

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అనంతరం వన్డేలకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌ ప్రకటిస్తారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. అయితే ఫైనల్‌ మ్యాచ్  అనంతరం రోహిత్, కోహ్లి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి

New Update
roko fans

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అనంతరం వన్డేలకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌ ప్రకటిస్తారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. అయితే ఫైనల్‌ మ్యాచ్  అనంతరం రోహిత్, కోహ్లి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తాను ఇప్పుడే రిటైర్‌ కావట్లేదని చెప్పుకొచ్చాడు.  2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడతాను లేదా ఆడను అని ఇప్పుడేమీ చెప్పలేనని రోహిత్ వెల్లడించాడు. ఆటను ఆస్వాదించే వరకు జట్టులో కొనసాగుతానని... ప్రస్తుతం జట్టు ఆడే తీరును చూస్తుంటే ఈ జట్టును వదలాలని లేదన్నాడు. 

Also read :  హైదరాబాద్‌లో విషాదం.. పిల్లలకు విషమిచ్చి ఆ తర్వాత భార్యాభర్తలు ఆత్మహత్య

  2027 వన్డే ప్రపంచకప్‌లో

తాను బాగా ఆడుతున్నానని..  జట్టు కూడా బాగా ఆడుతుందని రోహిత్ శర్మ వెల్లడించాడు.  ఇక జట్టును వీడేటపుడు మెరుగైన  స్థితిలో వదలాలని కోహ్లీ స్పష్టం చేశాడు.  దీంతో   2027 వన్డే ప్రపంచకప్‌లో  ఈ ఇద్దరు ఆటగాళ్లు ఆడటం ఖాయమేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు.  ప్రస్తుతం రోహిత్‌ వయసు 37 ఏళ్లు కాగా కోహ్లీ 36 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. 2027 వరల్డ్ కప్ వరకు వీరి  వయసు 40కి దగ్గరవుతుంది.  ఫిట్‌నెస్, ఫామ్‌ కాపాడుకుంటే ఇంకో రెండున్నరేళ్లు వీరిద్దరూ వన్డేల్లో కొనసాగడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.  

రోహిత్‌ తర్వాత కెప్టెన్సీ

అయితే  రోహిత్‌ తర్వాత కెప్టెన్సీ ఎవరూ తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.  ఇక బ్యాటింగ్ లలో కూడా వీరి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్లు ఎరనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అటు రిటైర్మెంట్ వార్తలపై ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు.  ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన రిటైర్మెంట్ వస్తోన్న వార్తలను నమ్మవద్దని అభిమానులను కోరాడు.  ధన్యవాదాలు అంటూ ఓ పోస్టు పెట్టాడు. దీంతో 2027 వన్డే వరల్డ్ కప్ వరకు జడేజా క్రికెట్ ఆడాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు.  

Also Read :  PM Modi: ప్రధాని మారిషస్ పర్యటన.. ఇండియా ఫండ్స్‌తో 20 ప్రాజెక్టులు ప్రారంభం

 

Advertisment
Advertisment
Advertisment