Rishabh Pant: పంత్‌కు రూ.27 కోట్లు కాదు రూ.15 కోట్లే.. ఎలాగంటే!

ఐపీఎల్ 2025 వేలంలో పంత్‌ను రూ.27 కోట్లకు లక్నో దక్కించుకుంది. అయితే అంత మొత్తం పంత్‌కు రాదు. 30శాతం టాక్స్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ టాక్స్, సర్‌ఛార్జీ కలుపుకుంటే రూ.11.48 కోట్లకుపైనే ప్రభుత్వ ఖజానాకు వెళ్తాయి. దీంతో పంత్‌ చేతికి రూ.15.52 కోట్లు అందుతాయి.

New Update
panth (1),

ఐపీఎల్ 2025 మెగా వేలం ఇటీవల అట్టహాసంగా ముగిసింది. ఈ వేలంలో టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ భారీ ధర పలికాడు. కని విని ఎరుగని రీతిలో అతడు అమ్ముడుపోయాడు. తొలిరోజు లక్నో సూపర్ జెయింట్స్ దాదాపు రూ.27 కోట్లకు పంత్‌ను దక్కించుకుంది. దీంతో లీగ్ వేలం చరిత్రలో పంత్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. 

Also Read: యువతిని 40 ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు.. కారణం ఏంటో తెలుసా?

పంత్ చేతికి ఎంత అందుతుంది?

అయితే తాజా సమాచారం ప్రకారం.. పంత్‌ ఐపీఎల్ వేలంలో రూ.27 కోట్లు పలికినప్పటికీ.. అతడి చేతికి మాత్రం అంత మొత్తం అందదని తెలుస్తోంది. వివిధ పన్నుల కారణంగా తక్కువ మొత్తంలోనే అందుతుందని తెలుస్తోంది. పంత్ రూ.27 కోట్ల ఐపీఎల్ వేతనంపై 30 శాతం (రూ.8.06 కోట్లు) ఆదాయపు పన్ను వసూలు చేస్తారు. మిగిలేది రూ.18.94 కోట్లు మాత్రమే. ఇది మాత్రమే కాకుండా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ టాక్స్, సర్‌ఛార్జీ ఇలా కలుపుకుంటే మొత్తం రూ.11.48 కోట్లకుపైనే ప్రభుత్వ ఖజానాకు చేరుతాయి.

Also Read: జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా హేమంత్‌ ప్రమాణ స్వీకారం..రానున్న ఖర్గే,రాహుల్‌

దీంతో పంత్‌ చేతికి కేవలం రూ.15.52 కోట్లు మాత్రమే అందుతాయిని తెలుస్తోంది. అయితే ప్రయాణ ఖర్చులు, మేనేజర్ ఫీజు, ఎక్విప్‌మెంట్ కొనుగోళ్లు, అకామిడేషన్, అకౌంటింగ్, ఇతర ఖర్చులను చూపిస్తే.. పంత్ చేతికి వచ్చే మొత్తం పెరిగే అవకాశం ఉంది. అలాగే సర్‌ఛార్జీలు లేకుండా కేవలం 30 శాతం టాక్స్ మాత్రమే కడితే.. పంత్‌ చేతికి రూ.18.94 కోట్లు వస్తాయి.

Also Read:ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్.. టికెట్ ధరలపై 20 శాతం రాయితీ!

ఇది కాకుండా ఐపీఎల్ సమయంలో పంత్‌ గాయపడితే.. అతడికి పూర్తి వేతనం అందిస్తారు. అయితే టోర్నీకి ముందే గాయపడి మ్యాచ్‌లు ఆడలేకపోతే పంత్‌కు బదులు వేరొక ప్లేయర్‌ను ఫ్రాంచైజీ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. టోర్నీకి ముందు గాయపడిన ఆటగాళ్లకు ఎలాంటి పరిహారం అందించరు. 

Also Read: అఖిల్‌ పెళ్లి గురించి నాగార్జున కీలక వ్యాఖ్యలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB VS RR: డ్రెస్ మార్చింది.. విజయం కొట్టింది- RCB ఖాతాలో మరో గెలుపు

బెంగళూరు జట్టు ఖాతాలో మరో విజయం పడింది. ఇవాళ రాజస్తాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌ను అలవోకగా ఛేదించింది. ఆర్ఆర్ జట్టు నిర్దేశించిన 174 లక్ష్యాన్ని కేవలం 1 వికెట్ నష్టపోయి గెలుపొందింది. 

New Update
RCB VS RR

RCB VS RR Photograph: (RCB VS RR)

బెంగళూరు ఖాతాలో మరో విజయం పడింది. ఇవాళ రాజస్తాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌ను అలవోకగా ఛేదించింది. ఎలాంటి ఉరుములు లేవు.. ఎలాంటి మెరుపులు లేవు.. కానీ తుఫాన్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయినట్లు బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఆర్ఆర్ జట్టు నిర్దేశించిన 174 లక్ష్యాన్ని కేవలం 1 వికెట్ నష్టపోయి గెలుపొందింది. 

Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

టాస్ గెలిచి బౌలింగ్

మొదట టాస్‌ గెలిచిన బెంగళూరు బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్‌, జైస్వాల్‌ మొదటి నుంచి దూకుడుగా ఆడారు. వరుస పరుగులు రాబట్టారు. ఇలా 5 ఓవర్లకు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 36 పరుగులు సాధించారు. సరిగ్గా అప్పుడే ఆర్ఆర్‌కు షాక్ తగిలింది. సంజు శాంసన్‌ (15) ఔట్‌ అయ్యాడు. ఇలా 10 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 77 పరుగులు సాధించారు. 

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

అలా వరుసగా వికెట్లు కోల్పోయింది ఆర్ఆర్ జట్టు. రియాన్‌ పరాగ్‌ (30), జైస్వాల్‌ (75), హెట్‌మయర్‌ (9), ధ్రువ్‌ జురెల్‌ (35*), నితీశ్‌ రాణా (4*) పరుగులు సాధించారు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆర్ఆర్ జట్టు 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఈ లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ జట్టు చాలా సహనంతో ఆడింది. క్రీజులోకి వచ్చిన ఫిల్‌ సాల్ట్‌, విరాట్‌ కోహ్లీ నెమ్మదిగా పరుగులు రాబట్టారు. 

Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

ఇద్దరూ సగానికి పైగా పరుగులు చేశారు. అంతేకాకుండా చెరో హాఫ్ సెంచరీతో మెరిసారు. అయితే ఆర్ఆర్ జట్టు వరుస క్యాచ్‌లు డ్రాప్ చేయడంతో విజయం బెంగళూరు సొంతం అయిందనే చెప్పాలి. ఫిల్‌సాల్ట్‌ (65) ఔట్‌ అయ్యాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. స్కోర్ భారీగా ఉంది. 10 ఓవర్లకు స్కోర్‌ 101/1గా ఉంది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 39 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా ఆ ఒక్క వికెట్ కోల్పోయి బెంగళూరు జట్టు విజయం సాధించింది. విరాట్‌కోహ్లీ 62*, దేవ్‌దత్‌ పడిక్కల్‌ 40* రాణించారు. 17.3 ఓవర్లలో 175 పరుగులు చేసింది ఆర్సీబీ.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు