Rashid Khan : రషీద్ ఖాన్ అరుదైన రికార్డు.. మలింగ, బుమ్రాలతో కలిసి

రషీద్ ఖాన్ అరుదైన రికార్డు సృష్టించాడు. 150 వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో తన పేరును నమోదు చేసుకున్నాడు. లసిత్ మలింగ, యుజ్వేంద్ర చాహల్ తర్వాత ఈ మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న మూడవ బౌలర్‌గా రషీద్ ఖాన్ నిలిచాడు.

New Update
r-khan

గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ అరుదైన రికార్డు సృష్టించాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తొలి ఐపీఎల్ మ్యాచ్ లో 150 వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో తన పేరును నమోదు చేసుకున్నాడు. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్యను ఏడో ఓవర్ నాలుగో బంతికి రషీద్ ఖాన్ అవుట్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు.  రషీద్ తన 122వ మ్యాచ్‌లో 150వ వికెట్‌ను చేరుకున్నాడు.

లసిత్ మలింగ, యుజ్వేంద్ర చాహల్ తర్వాత ఈ మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న మూడవ బౌలర్‌గా  రషీద్ ఖాన్ నిలిచాడు. మలింగ 105 మ్యాచ్‌ల్లో 150 వికెట్లు పడగొట్టగా, చాహల్ 118 మ్యాచ్‌ల్లో ఈ రికార్డును సాధించాడు. రషీద్ ఖాన్ తర్వాత ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 124 మ్యాచ్‌ల్లో 150 వికెట్లు సాధించాడు. డ్వేన్ బ్రావో 137 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించగా, భువనేశ్వర్ కుమార్ 138 మ్యాచ్‌ల్లో తన పేరును రికార్డుల్లో లిఖించుకున్నాడు. ఇక అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల లిస్టులో చాహల్ (205) టాప్ లో ఉండగా..  రషీద్ ఖాన్ 11వ స్థానంలో ఉన్నాడు.  

11 పరుగుల తేడాతో విజయం

అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో తొలి మ్యాచ్ లో పంజాబ్ విక్టరీ కొట్టింది.  244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (74), బట్లర్ (54) పరుగులు చేశారు. చివర్లో రన్స్‌ ఎక్కువగా ఉండటంతో బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీంతో గుజరాత్‌ ఆటగాళ్లు తడబడ్డారు. చివరికి పంజాబ్ కింగ్స్‌ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

Also read :  యాదగిరిగుట్టలో ఘోర ప్రమాదం.. 13 మంది స్పాట్

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

IPL 2025: ఒక్క మ్యాచ్ తో హాట్ టాపిక్ గా మారిన ప్రియాంశ్ ఆర్య..ఎవరీ కుర్రాడు?

ఒకే ఒక్క మ్యాచ్..రాత్రికి రాత్రే ఆ కుర్రాడిని హీరోగా మార్చేసింది. అంతర్జాతీయ అనుభవం లేదు..దేశవాళీలోనూ పాతిక మ్యాచ్ లు కూడా ఆడలేదు. కానీ ఐపీఎల్ లో నాలుగో మ్యాచ్ లోనే సెంచరీ బాదేసి..హాట్ టాపిక్ గా మారిపోయాడు ప్రియాంశ్ ఆర్య. ఎవరీ కుర్రాడు?

New Update
ipl

Priyansh Arya

నిన్న ముల్లాపూర్ లో సొంత మైదానంలో చెన్నైతో తలపడింది పంజాబ్ కింగ్స్. సీఎస్కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. ఎనిమిది ఒవర్లలోనే ఐదు వికెట్లు పడిపోయాయి. కానీ ఒక కుర్రాడు మాత్రం ఫీల్డ్ ను అతుక్కుని ఉండిపోయాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు చెక్కుచెదరకుండా ఫోర్లు, సిక్స్ లతో విరుచుకుపడ్డాడు. సీఎస్కే బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. ఆ కుర్రాడే ప్రియాంశ్ ఆర్య. 42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్ లతో 103 పరుగులు చేసి పంజాబ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అత్యంత ప్రమాదకరమైన పతిరన బౌలింగ్ లో హ్యాట్రిక్ సిక్స్ లు కొట్టి వారెవ్వా అనిపించాడు. 

ఢిల్లీ కుర్రాడు..
 

24 ఏళ్ళ ప్రియాంశ్ ఆర్య ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. దేశావాళీల్లో కూడా పాతిక మించి ఆడి ఉండడు. కానీ ఐపీఎల్ లో సెలెక్ట్ అయ్యాడు.  ఉత్తరప్రదేశ్ లో పుట్టిన ప్రియాంశ్ ఢిల్లీలో పుట్టి పెరిగాడు. దేశవాళీలో కూడా ఢిల్లీ తరుఫునే ఆడాడు. 2021/22 సీజన్‌లో అరంగేట్రం చేసిన ప్రియాంశ్‌ కేవలం 7 లిస్ట్‌ - A మ్యాచులు ఆడాడు. అతడు చేసిన పరుగులు 77 మాత్రమే. దేశవాళీల్లో టీ 20ల్లో 22 మ్యాచుల్లో 731 పరుగులు చేశాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో నార్త్‌ దిల్లీ స్ట్రైకర్‌పై 50 బంతుల్లోనే 120 పరుగులు చేసిన ఆర్య ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టాడు. అలాగే సయ్యద్ ముస్తాక్ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ పై 102 పరుగులతో చితక్కొట్టాడు. వీటితో వెలుగులోకి వచ్చిన ప్రియాంశ్ ఆర్య ఐపీఎల్ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. దాంతో పంజాబ్ కింగ్స్ ఇతనిని రూ.3.80 కోట్లు ఇచ్చి దక్కించుకుంది. 

ఐపీఎల్ లో ..

ఐపీఎల్ లో ఇప్పటివరకు పంజాబ్ నాలుగు  మ్యాచ్ లు ఆడింది.  మొదటి మ్యాచ్ లో గుజరాత్ పై 22 బంతుల్లో 47 పరుగులు చేసి తానమేంటో మరోసారి నిరూపించుకున్నాడు. భారీ మొత్తాన్ని వెచ్చించి ఎందుకు కొనక్కున్నారో చేసి చూపించాడు. ఆ తర్వాత రెండు మ్యాచ్ లలో 8, 0 పరుగులతో తేలిపోయాడు. కానీ నిన్న ముల్లాన్ పూర్ లో జరిగిన మ్యాచ్ లో మాత్రం విజృంభించేశాడు. ఐపీఎల్‌లో నాలుగో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 

today-latest-news-in-telugu | IPL 2025 | punjab-kings 

Also Read: Tahawwur Rana: భారత్ కు తహవూర్ రాణా అప్పగింత..స్పెషల్ ఫ్లైట్ లో..

Advertisment
Advertisment
Advertisment