/rtv/media/media_files/2025/03/21/hy3AXwyvHguTXUQwM23J.jpg)
న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20లో పాకిస్థాన్ జట్టు ఘనవిజయం సాధించింది. 205 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పాక్.. కేవలం ఒక వికెట్ ను మాత్రమే కోల్పోయి 16 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో తొమ్మది వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఓపెనర్ హసన్ నవాజ్ 105 పరుగులతో నాటౌట్ గా నిలిచి విధ్వంసం సృష్టించాడు. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఇందులో 10 ఫోర్లు, 7 సిక్సులున్నాయి. అతనికి తోడుగా కెప్టెన్ సల్మాన్ అఘూ (51*) హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
Fastest T20I hundreds for Pakistan:
— Kashif ali (@kashifyx) March 21, 2025
44 balls - Hasan Nawaz v New Zealand today
49 balls - Babar Azam v South Africa in 2021
58 balls - Ahmed Shehzad v Bangladesh in 2014
58 balls - Babar Azam v New Zealand in 2023#NZvsPAK
He's playing the first series, Pakistan chasing 200+ runs, A 22 year old Hasan Nawaz scored fastest Hundred for Pakistan in T20I Internationals History (44 balls).💯🙌🏻
— Cricket Fast Live Line (@cfll_live) March 21, 2025
.
.
.#hasannawaz #NZvsPAK #cricketnews #cricketupdates #cricketfastliveline #cfll pic.twitter.com/ayk3O3hFKX
Also Read : భర్తను చంపి భార్య ముక్కలు చేస్తే.. ఆమె ప్రియుడు తల, చేతులు తీసుకెళ్లి చేతబడి
మార్క్ చాప్మన్ 44 బంతుల్లో 94 పరుగులు
అంతకుముందు న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ చాప్మన్ 44 బంతుల్లో 94 పరుగులు చేయడంతో కివీస్ జట్టు 204 పరగులు చేసింది. చాప్మన్ 44 బంతుల్లో 11 బౌండరీలు, నాలుగు సిక్సర్లతో 94 పరుగులు చేశాడు. పాకిస్తాన్ తరఫున హారిస్ రౌఫ్ (3/39), షాహీన్ షా అఫ్రిది (2/36), అబ్రార్ అహ్మద్ (2/43), అబ్బాస్ అఫ్రిది (2/24), షాదాబ్ ఖాన్ (1/33) వికెట్లు తీశారు. కాగా అంతర్జాతీయ క్రికెట్ లో 200పైగా పరుగులను అత్యంత వేగంగా ఛేదించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో పాక్ కు ఇదే మొదటి విజయం. తొలి టీ20లో 91 పరుగులకే చాప చుట్టేసిన పాక్.. రెండో టీ20లో 135 పరుగులు చేసి ఓడింది.
Also Read : బెట్టింగ్ యాప్స్ కేసు.. హర్షసాయి ఆడియో లీక్- ఇమ్రాన్, అన్వేష్ పై సంచలన వ్యాఖ్యలు!