/rtv/media/media_files/2025/03/05/QbjrtHs90L0yb9BLeWpF.jpg)
పాకిస్థాన్ టీ20 కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు షాక్ ఇచ్చింది. త్వరలో న్యూజిలాండ్‌తో జరగబోయే ఐదు మ్యాచ్ లటీ20ల సిరీస్ కోసం రిజ్వాన్‌ను తప్పించి అతని స్థానంలో సల్మాన్ అలీ అఘాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ సిరీస్‌కు రిజ్వాన్‌తో పాటు మాజీ కెప్టెన్ బాబార్ ఆజమ్‌ను కూడా బోర్డు పక్కనపెట్టింది. పాక్ లో కీలక ఆటగాడిగా ముద్రపడిన ఆజమ్ కు ఇది పెద్ద షాకేనని చెప్పాలి.
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ దారుణమైన ప్రదర్శన తర్వాత, ఆకిబ్ జావేద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రాబోయే రెండు ప్రధాన టోర్నమెంట్‌లను దృష్టిలో ఉంచుకుని యువ టీ20 జట్టును ఎంపిక చేయాలని నిర్ణయించింది. వన్డేలకు మాత్రం రిజ్వాన్ కెప్టెన్సీ చేస్తారని బోర్టు స్పష్టం చేసింది. ఇక వన్డే జట్టులో షాహీన్ అఫ్రిది చోటు లభించకపోగా.. పొట్టి ఫార్మాట్‌లో అవకాశం లభించింది. గత ఏడాది చివర్లో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో సల్మాన్ పాకిస్తాన్‌ను 2-1 తేడాతో గెలిపించాడు. కాగా మార్చి 16 నుండి పాకిస్తాన్ న్యూజిలాండ్‌లో ఐదు టీ20లు, ఆ తర్వాత మూడు వన్డేలు ఆడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే.
టీ20, వన్టే జట్లు ఇవే!
టీ20 జట్టు: హసన్ నవాజ్, ఒమైర్ యూసుఫ్, మహ్మద్ హరీస్ అబ్దుల్ సమద్, సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), ఇర్ఫాన్ నియాజీ, ఖుష్దిల్ షా, షాదాబ్ ఖాన్ అబ్బాస్ అఫ్రిది, జహందాద్ ఖాన్, మహ్మద్ అలీ, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రవూఫ్, సుఫియాన్, ఎ.
వన్డే జట్టు: మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అలీ అఘా, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, అకీఫ్ జావేద్, బాబర్ అజామ్, ఫహీమ్ అష్రఫ్, ఇమామ్-ఉల్-హక్, ఖుష్దిల్ షా, మహ్మద్ అలీ, మహ్మద్ వసీం జూనియర్, ఇర్ఫాన్ షాహిర్, తాబ్ నియాజీ, తాబ్ నియాజీ, నసీమ్.
మార్చి 16 – మొదటి టీ20, హాగ్లీ ఓవల్, క్రైస్ట్‌చర్చ్
మార్చి 18 – రెండవ టీ20, యూనివర్సిటీ ఓవల్, డునెడిన్
మార్చి 21 - మూడవ టీ20, ఈడెన్ పార్క్, ఆక్లాండ్
మార్చి 23 - నాల్గవ టీ20, బే ఓవల్, మౌంట్ మౌంగనుయి
మార్చి 26 – ఐదవ టీ20, స్కై స్టేడియం, వెల్లింగ్టన్
మార్చి 29 – మొదటి వన్డే, మెక్లీన్ పార్క్, నేపియర్
ఏప్రిల్ 2 – రెండవ వన్డే, సెడాన్ పార్క్, హామిల్టన్
ఏప్రిల్ 5 - మూడవ వన్డే, బే ఓవల్, మౌంట్ మౌంగనుయి
Also read : Shama Mohamed : అప్పుడు తిట్టింది.. ఇప్పుడు పొగిడింది.. షామా మహమ్మద్ మరో ట్వీట్