/rtv/media/media_files/2025/03/11/K6qStoLx5LRSJFAhviMs.jpg)
పాకిస్థాన్ (Pakistan) తో త్వరలో జరగబోయే టీ20 సిరీస్ కు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (New Zeland) జట్టును ప్రకటించింది. మైఖేల్ బ్రేస్‌వెల్ కు కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించింది. మైఖేల్ బ్రేస్‌వెల్ ఇప్పటివరకు ఐదు టీ 20 సిరీస్ లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. గత ఏడాది పాకిస్థాన్ పర్యటనలో బ్రేస్‌వెల్ బ్లాక్ క్యాప్స్‌కు నాయకత్వం వహించగా.. ఆ సిరీస్ 2-2తో డ్రా అయింది. మార్చి 22నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం మిచెల్ సాంట్నర్ తో పాటుగా డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్రలను కివీస్ బోర్డు ఎంపిక చేయలేదు.
Also Read : బాత్రూమ్‌లో ఈ వస్తువులు ఉంచితే.. ఇంట్లో ఇక సంతోషమే!
ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) లో బ్రేస్‌వెల్ కీలక పాత్ర పోషించాడు, బంగ్లాదేశ్‌పై నాలుగు వికెట్లు పడగొట్టడంతో పాటు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్‌తో జరిగిన ఫైనల్‌లో అర్ధ సెంచరీ కూడా చేశాడు. పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ మార్చి 16 ఆదివారం క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో ప్రారంభమవుతుంది. ఆ తరువాత వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది.
Also Read : ఆడుతూ.. ఆడుతూ కొడుకు మీద కూర్చుంది.. బాలుడి ప్రాణం తీసిన తల్లి సరదా
మార్చి 16 – మొదటి టీ20, హాగ్లీ ఓవల్, క్రైస్ట్‌చర్చ్
మార్చి 18 – రెండవ టీ20, యూనివర్సిటీ ఓవల్, డునెడిన్
మార్చి 21 - మూడవ టీ20, ఈడెన్ పార్క్, ఆక్లాండ్
మార్చి 23 - నాల్గవ టీ20, బే ఓవల్, మౌంట్ మౌంగనుయి
మార్చి 26 – ఐదవ టీ20, స్కై స్టేడియం, వెల్లింగ్టన్
మార్చి 29 – మొదటి వన్డే, మెక్లీన్ పార్క్, నేపియర్
ఏప్రిల్ 2 – రెండవ వన్డే, సెడాన్ పార్క్, హామిల్టన్
ఏప్రిల్ 5 - మూడవ వన్డే, బే ఓవల్, మౌంట్ మౌంగనుయి
Also Read : సచిన్ కూతుర్ని వదిలేసినట్టేనా.. కొత్త అమ్మాయితో గిల్ డేటింగ్!
న్యూజిలాండ్ జట్టు
మైఖేల్ బ్రేస్‌వెల్, ఫిన్ అల్లెన్, మార్క్ చాప్‌మన్, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మిచ్ హే, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, విల్ ఓ రూర్కే, టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి
Also read : లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ గంగారాం మృతి