Ruturaj Gaikwad: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోని.. IPL  నుంచి రుతురాజ్ ఔట్

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన ఎడమ మోచేయి గాయంతో ఐపీఎల్ నుంచి నిష్క్రమించాడు. ఇకనుంచి CSK జట్టు కెప్టెన్‌గా ధోని ఉండనున్నాడు. ఈ విషయాన్నిCSK ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపారు.

New Update
ms dhoni returns as chennai super kings captain

ms dhoni returns as chennai super kings captain

రుతురాజ్ ఔట్

ఐపీఎల్ 18 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుస విజయాలతో సతమతమవుతోంది. ఇప్పటికి వరుసగా నాలుగు ఓటములను మూటగట్టుకుంది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన ఎడమ మోచేయి గాయంతో ఐపీఎల్ నుంచి పూర్తిగా నిష్క్రమించాడు. 

ఇది కూడా చదవండి: సన్నటి కనుబొమ్మలతో ఇబ్బంది పడుతున్నారా..ఇలా చేస్తే మందంగా పెరుగుతాయి

కెప్టెన్‌గా ధోని

ఇకనుంచి CSK జట్టు కెప్టెన్‌గా ధోని ఉండనున్నాడు. ఈ విషయాన్ని ఆ జట్టు యాజమాన్యం తెలిపింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు రోజు.. గైక్వాడ్ ఎడమ మోచేయిపై బలంగా ఫ్రాక్చర్ అయింది. అందువల్ల ఈ 18వ సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఇకపై పాల్గొనడని CSK ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అఫీషియల్‌గా వెల్లడించారు. ‘‘ ఎడమ మోచేయి గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. మిగిలిన మ్యాచ్‌లకు ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు’’ అని ఫ్లెమింగ్ చెన్నైలో విలేకరులతో చెప్పారు. 

Also Read: డ్రాగన్ వచ్చేది అప్పుడే..! రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న NTR 31..

ఇది కూడా చదవండి: అతిగా ఆలోచించడం వల్ల కలిగే సమస్యలు

Also Read: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్‌ కలిసొస్తుందా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB VS DC: ఈ సాలాకప్ నమ్దే..ఢిల్లీపై విజయం..అగ్రస్థానానికి ఆర్సీబీ

ఐపీఎల్ లో ఈరోజు ఢిల్లీ, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఢిల్లీ ఇచ్చిన 162 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18.3 ఓవర్లలో ఛేదించింది. 

New Update
ipl

RCB VS DC

విరాట్ కోహ్లీ మళ్ళీ గర్జించాడు. యంగ్ స్లేయర్ కృనాల్ విజృంభించాడు. దీంతో ఢిల్లీ చేతులెత్తేసింది. ఈరోజు ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ అద్బుత విజయం సాధించింది.  మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది. దీంతో 162 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టు మొదట్లోనే మూడు వికెట్లు కోల్పోయి కాస్త టెన్షన్ పెట్టింది. కానీ ఓపెనర్ గా వచ్చిన కింగ్ కోహ్లీ నిలకడగా ఆడుతూ జట్టును నిలబెట్టాడు. అలాగే నాలుగు స్థానంలో బ్యాటింగ్ కు దిగిన కృనాల్ విజృంభించేశాడు. దీంతో మ్యాచ్ ఆర్సీబీ వశమైంది. కృనాల్‌ పాండ్య (73*), విరాట్‌ కోహ్లీ (51) అర్ధశతకాలతో చెలరేగారు. దీంతో వరుసగా మూడు మ్యాచ్ లను గెలిచిన బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్ళింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ రెండు వికెట్లు తీశాడు. ఆర్సీబీకి ఇది ఏడో విజయం. 

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని..

ముందుగా టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు ఓపెనర్లు మంచి ఫామ్ అందించారు. అభిషేక్‌ పోరెల్‌, డుప్లెసిస్‌ మొదటి నుంచి దూకుడుగా ఆడారు. కానీ ఓపెనర్ అభిషేక్‌ పోరెల్‌ క్రీజులో ఎక్కువ సమయం నిలబడలేకపోయాడు. జోష్‌ హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో పోరెల్‌ (28) ఔట్‌ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కరుణ్ నాయర్ మరుసటి ఓవర్‌లోనే పెవిలియన్‌కు చేరాడు. నాయర్‌ (4) ఔట్‌ అయ్యాడు. దీంతో 5 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 45 పరుగులు సాధించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్, డుప్లెసిస్ మెల్లి మెల్లిగా పరుగులు రాబట్టారు. ఆచితూచి ఆడుతున్న సమయంలో మరో బిగ్ షాక్ తగిలింది. డుప్లెసిస్‌ (22) ఔట్‌ అయ్యాడు. కృనాల్‌ పాండ్య వేసిన 9.5 ఓవర్‌లో విరాట్‌ కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ జట్టు 10 ఓవర్లకు 3 వికెట్లు నష్టపోయి 72 పరుగులు మాత్రమే చేసింది. గత మ్యాచ్‌లతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ స్కోర్ అనే చెప్పాలి. ఇలా మొత్తంగా 20 ఓవర్లలో 162 పరుగులు సాధించింది.

today-latest-news-in-telugu | IPL 2025 | dc vs rcb | match 

Also Read: India: పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది వెనక్కు..

Advertisment
Advertisment
Advertisment