BIG Breaking: రిటైర్మెంట్ వార్తలపై ధోనీ బిగ్ అనౌన్స్మెంట్!

ధోని తన రిటైర్మెంట్ వార్తలపై తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ప్రస్తావించాడు. 44 ఏళ్ల వయసులో కూడా తాను క్రికెట్ ఆడుతున్నానని..  తదుపరి సీజన్ ఆడాలా వద్దా అనేది డిసైడ్ కావడానికి ఇంకా పది నెలల సమయం ఉందన్నాడు. తన శరీరం అందించే సహకారాన్ని బట్టి నిర్ణయం ఉంటుందన్నాడు.

New Update
Dhoni IPL retirement

Dhoni IPL retirement

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ఎంఎస్ ధోని తన రిటైర్మెంట్ వార్తలపై తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ప్రస్తావించాడు. ఏప్రిల్ 5, శనివారం రోజున చిదంబరం స్టేడియంలోని స్టాండ్స్‌లో ధోని తల్లిదండ్రులు మ్యాచ్ చూస్తూ కనిపించినప్పుడు ధోనీ తన ఇండియన్ ప్రీమియర్ లీగ్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వ్యాపించాయి. అయితే రాజ్ షమానీతో కొత్త పాడ్‌కాస్ట్‌లో, ధోని రిటైర్మెంట్ పుకార్లను ప్రస్తావిస్తూ ఈ సీజన్ చివరిలో తన కెరీర్‌కు ముగింపు పలకడం లేదని అభిమానులకు భరోసా ఇచ్చాడు.

శరీరం అందించే సహకారాన్ని బట్టి నిర్ణయం

44 ఏళ్ల వయసులో కూడా తాను క్రికెట్ ఆడుతున్నానని..  తదుపరి సీజన్ ఆడాలా వద్దా అనేది డిసైడ్ కావడానికి ఇంకా పది నెలల సమయం ఉందన్నాడు. అందుకు తన శరీరం అందించే సహకారాన్ని బట్టి నిర్ణయం ఉంటుందని ధోనీ పాడ్‌కాస్ట్‌లో  చెప్పుకొచ్చాడు. ఐపీఎల్  2025 కి ముందు, ధోని ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, పరిస్థితులు అనుకూలించినంత కాలం క్రికెట్‌ను ఆస్వాదిస్తూనే ఉండాలని కోరుకుంటున్నానని చెప్పాడు. 

2008 నుండి చెన్నై తరుపున

ధోని 2008 నుండి చెన్నై సూపర్ కింగ్స్‌ తరుపున ఆడుతున్నాడు.  అతని నాయకత్వంలో ఆ జట్టు ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. 2022లో రవీంద్ర జడేజాకు కెప్టెన్సీని అప్పగించినప్పటికీ, ఆ తర్వాత మళ్లీ జట్టు బాధ్యతలను చేపట్టాల్సి వచ్చింది. 2023 ప్రారంభంలో ధోని తన కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించాడు.  

Also Read :  Bhadrachalam Temple : భద్రాద్రి రామయ్యకు"ప్రభుత్వ" కానుక..ఆనాటి నుంచే…..

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB VS RR: డ్రెస్ మార్చింది.. విజయం కొట్టింది- RCB ఖాతాలో మరో గెలుపు

బెంగళూరు జట్టు ఖాతాలో మరో విజయం పడింది. ఇవాళ రాజస్తాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌ను అలవోకగా ఛేదించింది. ఆర్ఆర్ జట్టు నిర్దేశించిన 174 లక్ష్యాన్ని కేవలం 1 వికెట్ నష్టపోయి గెలుపొందింది. 

New Update
RCB VS RR

RCB VS RR Photograph: (RCB VS RR)

బెంగళూరు ఖాతాలో మరో విజయం పడింది. ఇవాళ రాజస్తాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌ను అలవోకగా ఛేదించింది. ఎలాంటి ఉరుములు లేవు.. ఎలాంటి మెరుపులు లేవు.. కానీ తుఫాన్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయినట్లు బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఆర్ఆర్ జట్టు నిర్దేశించిన 174 లక్ష్యాన్ని కేవలం 1 వికెట్ నష్టపోయి గెలుపొందింది. 

Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

టాస్ గెలిచి బౌలింగ్

మొదట టాస్‌ గెలిచిన బెంగళూరు బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్‌, జైస్వాల్‌ మొదటి నుంచి దూకుడుగా ఆడారు. వరుస పరుగులు రాబట్టారు. ఇలా 5 ఓవర్లకు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 36 పరుగులు సాధించారు. సరిగ్గా అప్పుడే ఆర్ఆర్‌కు షాక్ తగిలింది. సంజు శాంసన్‌ (15) ఔట్‌ అయ్యాడు. ఇలా 10 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 77 పరుగులు సాధించారు. 

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

అలా వరుసగా వికెట్లు కోల్పోయింది ఆర్ఆర్ జట్టు. రియాన్‌ పరాగ్‌ (30), జైస్వాల్‌ (75), హెట్‌మయర్‌ (9), ధ్రువ్‌ జురెల్‌ (35*), నితీశ్‌ రాణా (4*) పరుగులు సాధించారు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆర్ఆర్ జట్టు 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఈ లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ జట్టు చాలా సహనంతో ఆడింది. క్రీజులోకి వచ్చిన ఫిల్‌ సాల్ట్‌, విరాట్‌ కోహ్లీ నెమ్మదిగా పరుగులు రాబట్టారు. 

Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

ఇద్దరూ సగానికి పైగా పరుగులు చేశారు. అంతేకాకుండా చెరో హాఫ్ సెంచరీతో మెరిసారు. అయితే ఆర్ఆర్ జట్టు వరుస క్యాచ్‌లు డ్రాప్ చేయడంతో విజయం బెంగళూరు సొంతం అయిందనే చెప్పాలి. ఫిల్‌సాల్ట్‌ (65) ఔట్‌ అయ్యాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. స్కోర్ భారీగా ఉంది. 10 ఓవర్లకు స్కోర్‌ 101/1గా ఉంది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 39 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా ఆ ఒక్క వికెట్ కోల్పోయి బెంగళూరు జట్టు విజయం సాధించింది. విరాట్‌కోహ్లీ 62*, దేవ్‌దత్‌ పడిక్కల్‌ 40* రాణించారు. 17.3 ఓవర్లలో 175 పరుగులు చేసింది ఆర్సీబీ.

Advertisment
Advertisment
Advertisment