/rtv/media/media_files/2025/03/23/QYMIyzet4t3z5mRJYda7.jpg)
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో సన్‌రైజర్స్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ గాయం అయింది. దీంతో వెంటనే అతను మైదానం నుండి వెళ్లిపోయాడు. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ పన్నెండవ ఓవర్లో ఇది జరిగింది. క్యా్చ్ పట్టుకునే క్రమంలో షమీ వేలికి గాయం అయింది. దీంతో అతను మైదానం నుండి వెళ్లిపోయాడు. అంతకుముందు, షమీ తన మూడు ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి.. నితీష్ రాణా వికెట్‌ను తీశాడు. అయితే మహ్మద్ షమీకి తగిలిన గాయం మాములుదేనా లేకా తీవ్రమైనది అన్నది తెలియాల్సి ఉంది. కాగా రాజస్థాన్ రాయల్స్ పై సన్‌రైజర్స్ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Mohammad Shami leaves the field after the ball smacked his left palm as he put his hand out to catch.
— InsideSport (@InsideSportIND) March 23, 2025
📸: JioHotstar#IPL2025 #SRHvsRR #MohammadShami #CricketTwitter pic.twitter.com/D1VI9oCAKp