/rtv/media/media_files/2025/02/24/0TqfQmJwNEs5xmp9HjtG.jpg)
Mohammad Rizwan Photograph: (Mohammad Rizwan)
ఆదివారం సాయంత్రం దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లీగ్ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. పాక్ నిర్ధేశించిన 241 పరుగులను భారత్ సులభంగా ఛేదించింది. 6 వికెట్లు మిగిలి ఉండగానే హై-వోల్టేజ్ మ్యాచ్ విజయవంతమైంది. ఇక అందరూ ఊహించినట్లుగానే మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది.
తస్బీహ్‌తో రిజ్వాన్
అయితే ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ చేసిన ఓ పని నెట్టింట వైరల్‌గా మారింది. అతడు మ్యాచ్ సమయంలో ‘తస్బీహ్’ (ప్రార్థన పూసలు)తో కనిపించాడం అందరినీ షాక్‌కి గురిచేస్తుంది. అతడు మ్యాచ్ జరుగుతున్న సమయంలో ప్రార్థనా పూసలతో అదృష్టం మారాలని ప్రార్థిస్తూ కనిపించాడు. కానీ అది జరగలేదు.
ఇది కూడా చదవండి: Champions Trophy: ఎడారి దేశంలో...దాయాది పోరులో రికార్డుల మోత
Pakistanis are part time cricketers full time Maulanas😹😹😹😹#INDvsPAK pic.twitter.com/GJg4tvmw4R
— God (@Indic_God) February 23, 2025
అయితే రిజ్వాన్ చర్య నెట్టింట వైరల్‌గా మారింది. అప్పటికే కామెంట్రీ బాక్స్‌లో ఉన్న భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా సరదగా రిజ్వాన్ చర్యను ఎగతాళి చేసాడు. రిజ్వాన్ తస్బీహ్ లెక్కిస్తున్నట్లు టీవీ స్క్రీన్‌లో మెరిసాడు. దీంతో రైనా సరదాగా, “రోహిత్ శర్మ భీ మహామృత్యుంజయ్ మంత్ర పధ్ రహే హోంగే (రోహిత్ శర్మ కూడా మహామృత్యుంజయ్ మంత్రం జపించేవాడు)” అని సరదగా చెప్పుకొచ్చాడు.
Also Read: Champions Trophy: పాక్ పై గెలుపుతో అదరగొట్టిన భారత్..విజయాలు సమం..
ఇకపోతే ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ రిజ్వాన్ మాట్లాడాడు. ‘‘ఈ పిచ్‌లో 280 పరుగులు మంచి స్కోరు అని మేము భావించాము. మిడిల్ ఓవర్లలో భారత్ బౌలర్లు చాలా బాగా బౌలింగ్ చేసి మా వికెట్లను పడగొట్టారు. నేను, సౌద్ షకీల్ కాస్త మెల్లగా ఆడాలని సమయం తీసుకున్నాము. వారు మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు. అందుకే మేము 240 పరుగులకు కుదించబడ్డాము’’ అని రిజ్వాన్ చెప్పుకొచ్చాడు.