/rtv/media/media_files/2025/01/26/aZUYN6TSLObQR6AzYdF6.jpg)
mohammad Siraj
టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్. బాలీవుడ్ సింగర్ జనై భోస్లే. వీరిద్దరూ కాస్త క్లోజ్ గా కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్న ఫోటో ఒకటి రీసెంట్ గా బయటకు వచ్చింది. దాంతో పాటూ మూడు రోజుల క్రితం జనై బర్త్ డేకు సిరాజ్ హాజరయ్యాడు. ఆ సెలబ్రేషన్స్ ఫోటోలనే ఆమె ఇన్స్టా లో పోస్ట్ చేసింది. అందులో సిరాజ్ తో కలిసి ఉన్న ఫిక్ కూడా ఉంది. ఇంకేం దొరికిందే సందు అనుకుని వారిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు రాసేశారు. సిరాజ్, జనై కలసి ఉన్న ఫోటోను కూడా వైరల్ చేసేశారు. దీంతో ఇదేదో తేడా కొట్టేలా ఉందని గ్రహించిన సిరాజ్ వెంటనే అలర్ట్ అయ్యాడు.
Also Read: మా స్కీమ్స్‌తో ప్రతి ఇంటికి నెలకు రూ.25 వేల ప్రయోజనం: కేజ్రీవాల్
𝐇𝐲𝐝𝐞𝐫𝐚𝐛𝐚𝐝 𝐜𝐫𝐢𝐜𝐤𝐞𝐭𝐞𝐫 𝐌𝐨𝐡𝐚𝐦𝐦𝐞𝐝 𝐒𝐢𝐫𝐚𝐣’𝐬 𝐩𝐡𝐨𝐭𝐨 𝐰𝐢𝐭𝐡 𝐀𝐬𝐡𝐚 𝐁𝐡𝐨𝐬𝐥𝐞’𝐬 𝐠𝐫𝐚𝐧𝐝𝐝𝐚𝐮𝐠𝐡𝐭𝐞𝐫 𝐬𝐩𝐚𝐫𝐤𝐬 𝐝𝐚𝐭𝐢𝐧𝐠 𝐫𝐮𝐦𝐨𝐫𝐬
— Hyderabad Mail (@Hyderabad_Mail) January 26, 2025
Indian cricketer Mohammed Siraj was recently spotted having a candid conversation with Asha… pic.twitter.com/mPtQwrH38V
నా చెల్లెలు రా బాబూ..
మీకో నమస్కారం రా అయ్యా ఆమె నాకు చెల్లెలు లాంటిది అంటూ మహ్మద్ సిరాజ్ ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు. దయచేసి మీ నోటికి వచ్చింది రాయకండి అని వేడుకున్నాడు. ఆమె లాంటి సోదరి నాకెవరూ లేరు. ఆమె లేకుండా నేను ఎక్కడా ఉండాలనుకోను. నక్షత్రాలతో చంద్రుడు ఉన్నట్లే.. ఆమె వెయ్యి మందిలో ఒకరు అంటూ భావుకత్వంతో కూడిన వక్యాలు కూడా రాశాడు సిరాజ్. మరవైపు జనై కూడా దీనిపై స్పందించింది. సిరాజ్ తనకు ప్రియమైన సోదరుడు అంటూ పోస్ట్ పెట్టింది. జనై భోస్లే...ఆశా భోస్లే మనువరాలు.
Also Read: HYD: హుస్సేన్ సాగర్ లో అగ్ని ప్రమాదం..రెండు బోట్లు దగ్ధం
Also Read: స్టార్‌లింక్ బీటా టెస్టింగ్ రేపే.. శాటిలైట్ నుంచి సెల్‌ఫోన్‌కు సిగ్నల్స్