కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించిన పాక్ కెప్టెన్

పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. కోహ్లీ ఫామ్‌లో లేడని అన్నారు. కానీ పెద్ద మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని రిజ్వాన్ ప్రశంసించాడు. 

New Update
MOHAMMAD RIZWAN ON VIRAT KOHLI

MOHAMMAD RIZWAN ON VIRAT KOHLI Photograph: (MOHAMMAD RIZWAN ON VIRAT KOHLI)

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 23న పాకిస్థాన్, భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించన విషయం తెలిసిందే. టీమిండియా గెలుపుతో దాదాపుగా సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ ఒంటి చేతితో టీమిండియాను గెలిపించాడు. ఫామ్‌లో లేడని ఆటకు రిటైర్‌మెంట్ ప్రకటించాలని కామెంట్లు చేసిన నెటిజన్లతోనే మళ్లీ శభాష్ అనిపించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ (100*) చేసి టీమిండియా గెలుపులో ముఖ్య పాత్ర పోషించాడు.

ఇది కూడా చూడండి: Kishan reddy: సీఎం రేవంత్ మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఇది కూడా చూడండి: AP Love case: ప్రియుడి కోసం పోటీ.. విషం తాగిన ఇద్దరు యువతులు.. చివరికి ఏమైందంటే!

మ్యాచ్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌..

ఈ క్రమంలో విరాట్‌ కోహ్లీపై భారత ఆటగాళ్లతో పాటు ఇతర దేశాల క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ భారత్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. ఈ సందర్భంగా కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. విరాట్ కోహ్లీ హార్డ్ వర్క్‌ను చూసి షాక్ అయ్యానని, అతను మ్యాచ్ కోసం ఎంతగానో కష్టపడ్డాడని అన్నాడు. కోహ్లీ ఫామ్‌లో లేడని అందరూ అన్నారు. కానీ ఇంత పెద్ద మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడాడని రిజ్వాన్ ప్రశంసించాడు. 

ఇది కూడా చూడండి: Allu Arjun: అల్లు అర్జున్ అంటే పిచ్చి.. అతడితో ఆ సీన్‌లలో అయినా ఓకే: టాలీవుడ్ హీరోయిన్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు