INDw vs AUSW : 214 పరుగులకు భారత్ ఆలౌట్‌ !

బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మొదటి వన్డే మ్యాచ్ లో భారత్ 48.3 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌట్‌ అయింది.  స్మృతి మంధాన, హర్మన్‌ ప్రీత్‌ హాఫ్‌ సెంచరీలు చేశారు.  రిచా (23), షెపాలీ (4), జెమీమా (8), దీప్తి (2) పరుగులు చేశారు.

New Update
ind vs aus

బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియా(australia) తో జరుగుతోన్న మొదటి వన్డే మ్యాచ్ లో భారత్(india) 48.3 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది.  ప్రతీకా రావల్ (0),  షఫాలీ వర్మ (4) వికెట్లను భారత్  కోల్పోయింది. అనంతరం  స్మృతి మంధాన, హర్మన్‌ ప్రీత్‌ హాఫ్‌ సెంచరీలు చేశారు.  రిచా (23), షెపాలీ (4), జెమీమా (8), దీప్తి (2), క్రాంతి గౌడ్‌ (2), శ్రీచరణి (1) పరుగులు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో ఆష్లే 3, మేగాన్‌ 2, బ్రౌన్‌, మెక్‌గ్రాత్, సోఫీ, అలనా కింగ్‌ తలో ఒక్కో వికెట్‌ తీశారు. - INDw vs AUSW

Also Read :  ఐదేళ్ల కొడుక్కి హార్దిక్‌ పాండ్యా రూ.4 కోట్ల గిఫ్ట్‌.. పక్కనే మాజీ భార్య నటాషా

జట్లు ఇవే 

ఇండియా XI: స్మృతి మంధాన, ప్రతీకా రావల్, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ, కష్వీ గౌతమ్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్

ఆస్ట్రేలియా XI: అలిస్సా హీలీ, ఫోబ్ లిచ్‌ఫైరెల్డ్, జార్జియా వోల్, బెత్ మూనీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్ గార్డ్నర్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, అలానా కింగ్, మేగాన్ షుట్, డార్సీ బ్రౌన్

Also Read :  మహ్మద్ షమీకి బిగ్ షాక్.. సుప్రీంకోర్టు నోటీసులు!

Advertisment
తాజా కథనాలు