/rtv/media/media_files/2025/04/12/lCkGheZaPuA83uHlUikm.jpg)
Lucknow Super Giants
ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ టీమ్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. 181 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో చేధించింది. నికోలస్ పూరన్ 61 పరుగులతో సత్తా చాటాడు. మరో మార్క్‌రమ్ 58 పరుగులు చేశాడు. ఇక గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీశాడు. రషీద్, సుందర్ ఒక్కో వికెట్ తీశారు.
Also Read: గుజరాత్‌కు మరో షాక్.. టోర్నీ నుంచి ఆల్‌రౌండర్ ఔట్!
మొత్తానికి సొంత గడ్డపై లక్నో టీమ్ గెలిచింది. టేబుల్‌లో ముందు వరుసలో ఉన్న గుజరాత్‌ను ఓడించి టాప్ 4వ స్థానానికి చేరుకుంది. ఫీల్డింగ్‌లో అద్భుతంగా రాణించిన లక్నో.. గుజరాత్ స్కోర్‌ను 180కే కట్టడి చేసింది. పవర్ ప్లేలో గుజరాత్ పేస్ గన్స్, ప్రసిధ్‌లు వేసిన బంతులకి బౌండరీలతో విరుచుకుపడ్డారు.
Also Read: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?
6 ఓవర్లకే లక్నో 62 పరుగులు చేసింది. సుందర్ బౌలింగ్‌లో పంత్ ఔట్ కావడంతో ఆ తర్వాత నికోలస్ పూరన్ వచ్చాడు. 34 బంతుల్లో 61 పరుగులు చేశారు. మరోసారి మర్క్‌రమ్ కూడా దూకుడుగా ఆడాడు. 26 బంతుల్లో 50 స్కోర్ చేశాడు. 10 ఓవర్లకు లక్నో స్కోర్ 114కు చేరింది. చివరికీ 181 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 6 వికెట్ల తేడాతో లక్నో టీమ్ గెలిచింది.
Q: How to stop Nicholas Pooran?
— IndianPremierLeague (@IPL) April 12, 2025
A: Error 404 Not Found ⚠
Half-century No. 4⃣ for Nicholas Pooran in #TATAIPL 2025 🫡
Updates ▶ https://t.co/VILHBLEerV #LSGvGT | @nicholas_47 pic.twitter.com/Wg2ZJB4zwc