/rtv/media/media_files/2025/03/24/MuaEQSt6JtJCgjpvT5Wt.jpg)
Lucknow Super Giants players Nicholas Pooran hit four consecutive sixes
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ VS లక్నో సూపర్ జెయింట్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగుతోంది. మొదటి టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ దుమ్ము దులిపేస్తోంది. క్రీజ్‌లోకి దిగిన మిచెల్ మార్స్, నికోలస్ పూరన్ అదరగొట్టేశారు. ఫోర్లు, సిక్సర్లతో వైజాగ్ వైఎస్సార్ స్టేడియంలో జోష్ పుట్టించారు.
No escaping #NicholasPooran's onslaught as he brings up his fifty! 💪
— Star Sports (@StarSportsIndia) March 24, 2025
0, 6, 6, 6, 6, 4 read Stubbs' over! 😳
Watch LIVE action: https://t.co/mQP5SyTHlW#IPLonJioStar 👉 #DCvLSG | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/llfmPxziaG
ఇది కూడా చూడండి: USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతి
బాదుడే బాదుడు
ముఖ్యంగా నికోలస్ పూరన్ దంచి కొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ప్రతి ఓవర్లలోనూ సిక్సర్లతో విజృంభించాడు. వేసిన ప్రతి బాల్‌ను గ్రౌండ్ అవతలకు పంపించాడు. ట్రిస్టన్ స్టబ్స్ వేసిన 13 ఓవర్‌లో తొలి బంతి డాట్.. కాగా.. తర్వాత పూరన్ వరుసగా 6,6,6,6 సిక్స్‌లు, ఒక ఫోర్ బాదేశాడు. దెబ్బకు నికోలస్ పూరన్ 70 స్కోర్‌తో అదరగొట్టేశాడు. ఇక చివరిగా మిచెల్ స్టార్క్ వేసిన 14.5 ఓవర్‌కు పూరన్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
Nicholas Pooran has shown what he can do at No.3 🔥
— Cricket.com (@weRcricket) March 24, 2025
The left hander is gone for 75(30). pic.twitter.com/gT1RdavCWa
Nicholas Powerful Pooran 💪
— CricTracker (@Cricketracker) March 24, 2025
📷: JioHotstar pic.twitter.com/h79b1jvdqz
ఇది కూడా చూడండి: Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్
దీంతో నికోలస్ పూరన్ (75; 30 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌కు తెరపడింది. అయితే పూరన్‌కు ఒక అవకాశం రావడంతో ఈ భారీ స్కోర్ చేశాడు. వరుసగా రెండు సిక్స్‌లు బాదిన తర్వాత పూరన్ ఇచ్చిన క్యాచ్‌ను సమీర్ రిజ్వీ అందుకోలేకపోవడంతో పూరన్ మరింత దూకుడు పెంచి ఈ భారీ స్కోర్ సాధించాడు. ఒక రకంగా చెప్పాలంటే.. క్యాచ్ డ్రాప్ మూల్యం ఎంత అనేది.. దీని బట్టి చూస్తే అర్థం అవుతుంది. ఇకపోతే ఈ సీజన్ వేలంలో రూ.16 కోట్లకు కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్‌కు పూరన్‌ను న్యాయం చేశాడనే చెప్పాలి.
THE NICHOLAS POORAN SHOW. 🔥pic.twitter.com/sbEk9dltBE
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 24, 2025
ఇది కూడా చదవండి: బంగారం ధరించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
ఇది కూడా చదవండి: తెలంగాణలో మరో ఎన్నికకు మోగిన నగారా.. షెడ్యూల్ విడుదల!
(latest-telugu-news | dc vs lsg | dc vs lsg prediction 2025 | dc vs lsg updates | telugu-news)