/rtv/media/media_files/2025/03/31/UWSayaGyiTSb85K4SIlr.jpg)
MAtch Photograph: (MAtch )
ఐపీఎల్‌లో భాగంగా వాంఖేడ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్లు చెలరేగిపోయారు. బ్యాటింగ్ చేస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు చుక్కలు చూపిస్తున్నారు. కేవలం 7 ఓవర్లకు 45 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశారు. ముంబై బౌలర్లను కేకేఆర్ జట్టు తట్టుకోలేకపోతుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై జట్టు బౌలింగ్‌లో అదరగొడుతుంది. వరుస వికెట్లు పడిపోతున్నాయి. దీన్ని బట్టి చూస్తే పది ఓవర్లు అయ్యే సరికి కేకేఆర్ జట్టు మొత్తం ఆలౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Hardik Pandya saying 'Bye Bye'.
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 31, 2025
KKR 45/5 AT THE WANKHEDE. pic.twitter.com/cK8KkJoXIZ
ఇదిలా ఉండగా కేకేఆర్ జట్టు మొదటి ఓవర్‌కే వికెట్‌ను కోల్పోయింది. తొలి ఓవర్‌లో ట్రెంట్ బౌల్ట్ వేసిన నాలుగో బంతికి సునీల్ నరైన్(0) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వరుసగా.. క్వింటన్ డి కాక్ డకౌట్ కాగా.. అజింక్య రహానే కూడా ఔట్ అయ్యాడు. మూడు ఓవర్లకే వరుసగా మూడు వికెట్లను కేకేఆర్ జట్టు కోల్పోయింది. ఆ తర్వాత వెంకటేశ్ అయ్యర్, రఘువంశీ కూడా పెవిలియన్ చేరారు.