MI vs KKR: 116 పరుగులకే కేకేఆర్ ఆలౌట్

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 16.2 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ముంబై జట్టు బౌలింగ్‌ను కేకేఆర్ జట్టు తట్టుకోలేకపోయింది. మొదటి నుంచే ముంబై ఇండియన్స్ బౌలర్లు కట్టుదిట్టంగా వేయడంతో ఓవర్లు ఉండగానే కేకేఆర్ జట్టు ఆలౌట్ అయ్యింది.

New Update
MAtch

MAtch

ఐపీఎల్‌లో భాగంగా వాంఖేడ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు బౌలర్లు చెలరేగిపోయారు. బ్యాటింగ్ చేస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ముంబై బౌలర్లు చుక్కలు చూపించారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై జట్టు బౌలింగ్‌ను కేకేఆర్ జట్టు తట్టుకోలేకపోయింది. ముంబై బౌలర్లు 16.2 ఓవర్లలో 116 పరుగులకే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును ఆలౌట్ చేశారు.  

రమణ్‌దీప్ సింగ్ (22), మనీశ్‌ పాండే (19), రింకు సింగ్ (17), అజింక్య రహానె (11) పరుగులు చేశారు. ఓపెనర్లు క్వింటన్ డికాక్ (1), సునీల్ నరైన్ (0)తోపాటు వెంకటేశ్‌ అయ్యర్ (3), ఆండ్రీ రస్సెల్ (5) సింగిల్ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు. ముంబయి బౌలర్లలో అశ్వని కుమార్ (4/24) అదరగొట్టాడు. దీపక్ చాహర్ 2, ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్య, విఘ్నేశ్‌ పుతుర్, శాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు. అయితే ముంబై జట్టు ఈ మ్యాచ్‌లో గెలవాలంటే 117 పరుగులు చేయాలి.

వరుస వికెట్లు..

ఇదిలా ఉండగా కేకేఆర్ జట్టు మొదటి ఓవర్‌కే వికెట్‌ను కోల్పోయింది. తొలి ఓవర్‌లో ట్రెంట్ బౌల్ట్ వేసిన నాలుగో బంతికి సునీల్ నరైన్(0) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వరుసగా.. క్వింటన్ డి కాక్ డకౌట్ కాగా.. అజింక్య రహానే కూడా ఔట్ అయ్యాడు. మూడు ఓవర్లకే వరుసగా మూడు వికెట్లను కేకేఆర్ జట్టు కోల్పోయింది.  ఆ తర్వాత వెంకటేశ్ అయ్యర్, రఘువంశీ పెవిలియన్ చేరారు. ఆ తర్వాత రింకూ సింగ్, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా ఔట్ అయ్యారు. చివరగా రమణదీప్ సింగ్ ఔట్ అయ్యాడు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

KKR VS SRH: మరీ ఇంత దారుణంగానా..ఎస్ఆర్హెచ్ కు ఏమైంది?

ఐపీఎల్ లో ఈరోజు జరిగిన కోలకత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ దారుణంగా ఓడిపోయింది. 80 పరుగుల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టకుంది. దీంతో ఎస్ఆర్హెచ్ కు హ్యాట్రిక్ ఓటమి వచ్చినట్టయింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

KKR VS SRH

అందరూ పెద్ద పెద్ద ప్లేయర్లు. భారీ అంచనాలు...కానీ ఏం లాభం..హైదరాబాద్ సన్ రైజర్స్ మాత్రం మ్యాచ్ లు గెలవలేకపోతోంది. వరుసగా మూడో మ్యాచ్ ఓడిపోయి హ్యాట్రిక్ ఓటములను తన ఖాతాలో వేసుకుంది. ఈరోజు కోలకత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయింది. 201 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 16.4 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. క్లాసెన్ ఒక్కడే 33 పరుగుల టాప్ స్కోరర్ గా నిలిచాడు అంటే అర్ధం చేసుకోవచ్చు...ఆ జట్టులో బ్యాటర్లు ఎంత ఘోరంగా విఫలం అయ్యారో. మెండిస్ 20 బంతుల్లో 27 పరుగులు చేసాడు. మిగతా వాళ్ళందరూ సింగిల్ డిజిట్లకే టపాటపా పడిపోయారు. హైదరాబాద్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనే ఈరోజు చేతులెత్తేసింది. కోల్‌కతా బౌలర్లలో వైభవ్‌ అరోరా 3, వరుణ్‌ చక్రవర్తి 3, రస్సెల్‌ 2, హర్షిత్‌ రాణా, సునిల్‌ నరైన్‌ ఒక్కో వికెట్‌ తీశారు. హైదరాబాద్ ఇలానే ఆడితే గ్రూప్ దశలోనే ఇంటి ముఖం పట్టడం ఖాయం.

హోమ్ గ్రౌండ్ లో దుళ్ళగొట్టిన కేకేఆర్..

ఈరోజు కేకేఆర్ తన హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడుతోంది. ఈడెన్ గార్డెన్స్ లో కేకేఆర్ వెర్స్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అవుతోంది. టాస్ ఓడిన కోలకత్తా మొదట బ్యాటింగ్ కు దిగింది. ఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 200 పరుగులు చేసింది. దీంతో హైదరాబాద్ కు 201 పరుగుల భారీ లక్ష్యం వచ్చింది. కేకేఆర్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ చివరి ఓవర్లలో అదరగొట్టాడు. చాలా వేగంగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. కేవలం 25 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తానికి 29 బంతుల్లో 3 సిక్స్ లు, ఏడు ఫోర్లతో 60 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.

మరోవైపు ఇదే జట్టులో రఘువంశీ కూడా 32 బంతుల్లో హాఫ్ సెంజరీ చేశాడు. అలాగే కెప్టెన్‌ అజింక్య రహానే 38; 27 బంతుల్లో 4 సిక్సులు, ఒక ఫోర్‌, రింకుసింగ్‌ 32*; 17 బంతుల్లో ఒక సిక్స్‌, నాలుగు ఫోర్లు కొట్టి ఎస్ఆర్ హెచ్ కు మంచి టార్గెట్ ను ఇవ్వడంలో సక్సెస్ అయ్యారు. డికాక్, నరైన్ లు మాత్రం నిరాశపర్చారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో షమీ, కమిన్స్‌, జీషన్‌ అన్సారీ, హర్షల్‌ పటేల్‌, కమిందు మెండిస్‌ తలో వికెట్‌ తీశారు.

 today-latest-news-in-telugu | IPL 2025 | kkr-vs-srh | match

Also Read: HCU: కంచ గచ్చిబౌలీ వివాదం..తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment