Ind Vs Nz: కేఎల్ రాహుల్‌పై వేటు.. జట్టులోకి బెంగాల్ బ్యాటర్!

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఘోరంగా విఫలమైన భారత బ్యాటర్ కేఎల్ రాహుల్‌పై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. అతడి స్థానంలో బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్‌ కు అవకాశం ఇవ్వాలని పలువురు మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

New Update
derer

Team India: టీమ్‌ఇండియా బ్యాటర్ కేఎల్ రాహుల్‌పై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఘోరంగా విఫలమైన రాహుల్ ను పక్కన పెట్టి మరో యువ ఆటగాడికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన రాహుల్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో 12 పరుగులే చేయడంతోపాటు ఏడాది ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో అతడు 234 పరుగులు చేశాడు. దీంతోపాటు స్పీడ్ బౌలర్లను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో రాహుల్ ను జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

ఇది కూడా చదవండి: ఓపికగా ఆడలేరా.. గంభీర్ టీమ్‌పై మాజీలు ఫైర్.. పూజారా కావాలంటూ!

మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా అభిమన్యు..

ఈ మేరకు టెస్టుల్లో రాహుల్ స్థానంలో బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్‌ కు అవకాశం ఇవ్వాలని పలువురు మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా మాజీ ఆటగాడు మనోజ్ తివారీ మాట్లాడుతూ.. ‘కేఎల్ రాహుల్ కు టెస్టుల్లో 91 ఇన్నింగ్స్‌ల్లో 33.98 సగటు ఉంది. భారత్‌లో నిలకడగా ఆడేవారు చాలామంది ఉన్నారు. దేశవాళీ క్రికెట్‌లో ప్రతిభావంతులున్నారు. కేఎల్ రాహుల్‌ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌ను తీసుకోవాలి. అతనికి ‘ఓపెనర్’ అనే ట్యాగ్ ఇచ్చాం. అతను స్పెషలిస్ట్ ఓపెనర్‌. మీరు అతని స్కోర్లను చూడండి. అభిమన్యు ఆడిన కొన్ని మ్యాచ్‌లలో సెంచరీ చేయని ఇన్నింగ్స్‌లు లేవు. కాబట్టి అతడిని జట్టులోకి తీసుకుని మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా ప్రయత్నించొచ్చు' అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. 

ఇది కూడా చదవండి: అన్‌స్టాపబుల్ 4 తొలి ఎపిసోడ్‌లో చంద్రబాబు.. వీటిపైనే మాట్లాడేది!

దేశవాళీ క్రికెట్‌లో అభిమన్యు పరుగుల వరద పారిస్తున్నాడు. దులీప్ ట్రోఫీ, ఇరానీ కప్‌తోపాటు రంజీ ట్రోఫీ ఓపెనింగ్‌ రౌండ్ మ్యాచ్‌లో సెంచరీలు చేశాడు. 

ఇది కూడా చదవండి: భారీ బందోబస్తు మధ్య గ్రూప్-1 మెయిన్స్.. యాక్షన్ లోకి 144 సెక్షన్!

ఇది కూడా చదవండి: ఢిల్లీ బాంబ్ పేలుడు వెనక ఉగ్ర కుట్ర.. కీలక విషయాలు వెల్లడించిన ఎన్ఐఏ!

Advertisment
Advertisment
తాజా కథనాలు