/rtv/media/media_files/2026/02/27/ipl-2026-2026-02-27-20-17-33.jpg)
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) సీజన్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ సీజన్ ప్రారంభ తేదీ మారే అవకాశం ఉంది. తొలుత మార్చి 26 నుంచి మొదలవుతుందని వెల్లడించిన బీసీసీఐ.. ఇప్పుడు రెండు రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇక మే 31న జరిగే గ్రాండ్ ఫినాలేతో ఈ ధనాధన్ లీగ్ ముగియనుంది. - telugu-sports-news
Also Read : జింబాబ్వేతో మ్యాచ్.. భారత్ రికార్డు స్కోర్!
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్
ఈ మార్పు స్వల్పమే అయినప్పటికీ ఫ్రాంచైజీలు తమ సన్నాహకాలను పక్కాగా ప్లాన్ చేసుకోవడానికి ఇది కీలకం కానుంది. షెడ్యూల్లో జరిగిన ఈ మార్పులను అధికారికంగా ఆమోదించడానికి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ త్వరలోనే సమావేశం కానుంది. ఈ భేటీ తర్వాతే తొలి మ్యాచ్ ఏ జట్ల మధ్య జరుగుతుంది, వేదికలు ఎక్కడ అనే అంశాలపై పూర్తి స్థాయి స్పష్టత రానుంది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్ ఏ నగరంలో నిర్వహిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
వచ్చే రెండు నెలల పాటు సాగే ఈ టీ20 పండుగ కోసం బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదం పొందిన వెంటనే పూర్తి మ్యాచ్ల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బరిలోకి దిగుతుండటంతో ఈసారి పోటీ మరింత రసవత్తరంగా ఉండనుంది. - telugu-cricket-news
Also Read : తొలి సూపర్-8 మ్యాచ్ రద్దు.. కివీస్-పాక్కు చెరో పాయింట్
Follow Us