IPL 2025: ఢిల్లీ కెప్టెన్ ఫిక్స్.. ఆ ఛాంపియన్‌కే జీఎంఆర్‌ మొగ్గు!

ఐపీఎల్ 2025 సీజన్ లో ఢిల్లీకి శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. శ్రేయస్‌ ను అధికమొత్తంలో కొని కెప్టెన్ బాధ్యతలు ఇస్తామని జీఎంఆర్‌ గ్రూప్‌ హామీ ఇచ్చినట్లు సమాచారం. 2024లో కోల్‌కతాను ఛాంపియన్‌గా నిలిపాడు శ్రేయస్‌. 

author-image
By srinivas
New Update
d deee

IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలంపై ఉత్కంఠ నెలకొంది. ఆటగాళ్ల రిటెన్షన్‌ లిస్ట్ విడుదలైనప్పటినుంచి ఫ్రాంఛైజీలతోపాటు అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే పలు జట్లు తమ కెప్టెన్లను వదులుకోగా.. నెక్ట్స్ ఏ జట్టుకు ప్రాతినిథ్యం వహించబోతున్నరనేది చర్చనీయాంశమైంది. ఇందులో ముఖ్యంగా ఢిల్లీ పంత్ ను వదిలిపెట్టగా నెక్ట్స్ ఎవరు కెప్టెన్ అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ అప్ డేట్ చక్కర్లు కొడుతోంది. గత సీజన్‌లో కోల్‌కతాను ఛాంపియన్‌గా నిలిపిన టీమ్‌ఇండియా స్టార్‌ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ ఢిల్లీ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. 

కెప్టెన్ బాధ్యతల ఇస్తామని హామీ..

ఈమేరకు ఢిల్లీ కాపిటల్స్‌ సహ యజమాని జీఎంఆర్‌ గ్రూప్‌ అతడిని జట్టులోకి తీసుకుని, కెప్టెన్ బాధ్యతల ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వేలంలో తామే తీసుకుంటామని, తమ వద్దనున్న రూ.73 కోట్లలో ఎక్కువ మొత్తం శ్రేయస్‌ కోసం పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే కేకేఆర్‌ సీఈవో వెంకీ మైసూర్‌ మాత్రం.. శ్రేయాస్ కు ఏ ఫ్రాంచైజీకి మధ్య పరస్పర ఒప్పందం కుదరలేదంటున్నాడు. తొలి రిటెన్షన్‌గా తాము అనుకున్నప్పటికీ అది సాధ్యపడలేదన్నాడు. వేలంలోకి వెళ్లేందుకే శ్రేయస్‌ నిర్ణయం తీసుకున్నట్లు వెంకీ చెప్పారు. ఇక ఈ ఐపీఎల్‌ 2025 రిటెన్షన్‌లో ముగ్గురు కెప్టెన్లు మెగా వేలంలో నిలవనున్నారు. శ్రేయస్‌, రిషభ్ పంత్, కే ఎల్ రాహుల్ ఉన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

IPL 2025: ఒక్క మ్యాచ్ తో హాట్ టాపిక్ గా మారిన ప్రియాంశ్ ఆర్య..ఎవరీ కుర్రాడు?

ఒకే ఒక్క మ్యాచ్..రాత్రికి రాత్రే ఆ కుర్రాడిని హీరోగా మార్చేసింది. అంతర్జాతీయ అనుభవం లేదు..దేశవాళీలోనూ పాతిక మ్యాచ్ లు కూడా ఆడలేదు. కానీ ఐపీఎల్ లో నాలుగో మ్యాచ్ లోనే సెంచరీ బాదేసి..హాట్ టాపిక్ గా మారిపోయాడు ప్రియాంశ్ ఆర్య. ఎవరీ కుర్రాడు?

New Update
ipl

Priyansh Arya

నిన్న ముల్లాపూర్ లో సొంత మైదానంలో చెన్నైతో తలపడింది పంజాబ్ కింగ్స్. సీఎస్కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. ఎనిమిది ఒవర్లలోనే ఐదు వికెట్లు పడిపోయాయి. కానీ ఒక కుర్రాడు మాత్రం ఫీల్డ్ ను అతుక్కుని ఉండిపోయాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు చెక్కుచెదరకుండా ఫోర్లు, సిక్స్ లతో విరుచుకుపడ్డాడు. సీఎస్కే బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. ఆ కుర్రాడే ప్రియాంశ్ ఆర్య. 42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్ లతో 103 పరుగులు చేసి పంజాబ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అత్యంత ప్రమాదకరమైన పతిరన బౌలింగ్ లో హ్యాట్రిక్ సిక్స్ లు కొట్టి వారెవ్వా అనిపించాడు. 

ఢిల్లీ కుర్రాడు..
 

24 ఏళ్ళ ప్రియాంశ్ ఆర్య ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. దేశావాళీల్లో కూడా పాతిక మించి ఆడి ఉండడు. కానీ ఐపీఎల్ లో సెలెక్ట్ అయ్యాడు.  ఉత్తరప్రదేశ్ లో పుట్టిన ప్రియాంశ్ ఢిల్లీలో పుట్టి పెరిగాడు. దేశవాళీలో కూడా ఢిల్లీ తరుఫునే ఆడాడు. 2021/22 సీజన్‌లో అరంగేట్రం చేసిన ప్రియాంశ్‌ కేవలం 7 లిస్ట్‌ - A మ్యాచులు ఆడాడు. అతడు చేసిన పరుగులు 77 మాత్రమే. దేశవాళీల్లో టీ 20ల్లో 22 మ్యాచుల్లో 731 పరుగులు చేశాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో నార్త్‌ దిల్లీ స్ట్రైకర్‌పై 50 బంతుల్లోనే 120 పరుగులు చేసిన ఆర్య ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టాడు. అలాగే సయ్యద్ ముస్తాక్ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ పై 102 పరుగులతో చితక్కొట్టాడు. వీటితో వెలుగులోకి వచ్చిన ప్రియాంశ్ ఆర్య ఐపీఎల్ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. దాంతో పంజాబ్ కింగ్స్ ఇతనిని రూ.3.80 కోట్లు ఇచ్చి దక్కించుకుంది. 

ఐపీఎల్ లో ..

ఐపీఎల్ లో ఇప్పటివరకు పంజాబ్ నాలుగు  మ్యాచ్ లు ఆడింది.  మొదటి మ్యాచ్ లో గుజరాత్ పై 22 బంతుల్లో 47 పరుగులు చేసి తానమేంటో మరోసారి నిరూపించుకున్నాడు. భారీ మొత్తాన్ని వెచ్చించి ఎందుకు కొనక్కున్నారో చేసి చూపించాడు. ఆ తర్వాత రెండు మ్యాచ్ లలో 8, 0 పరుగులతో తేలిపోయాడు. కానీ నిన్న ముల్లాన్ పూర్ లో జరిగిన మ్యాచ్ లో మాత్రం విజృంభించేశాడు. ఐపీఎల్‌లో నాలుగో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 

today-latest-news-in-telugu | IPL 2025 | punjab-kings 

Also Read: Tahawwur Rana: భారత్ కు తహవూర్ రాణా అప్పగింత..స్పెషల్ ఫ్లైట్ లో..

Advertisment
Advertisment
Advertisment